Caught on Cam: వీడియో ఇదిగో, సీఎం బంధువుపై నాటు బాంబులు విసిరి కత్తులతో నరికి చంపిన దుండగులు, క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో దారుణం చోటు చేసుకుంది. హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్ ను ఏడుగురు వ్యక్తులు బైకులపై వచ్చి దారుణంగా నరికి చంపారు. ముందుగా రెండు నాటు బాంబులు విసిరిన దుండగులు ఆయన కుప్పకూలగానే.. కర్రలతో దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు.

7 bike-borne men hurl country bombs at Puducherry BJP worker (Photo-Video Grab)

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో దారుణం చోటు చేసుకుంది. హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్ ను ఏడుగురు వ్యక్తులు బైకులపై వచ్చి దారుణంగా నరికి చంపారు. ముందుగా రెండు నాటు బాంబులు విసిరిన దుండగులు ఆయన కుప్పకూలగానే.. కర్రలతో దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. అనంతరం బైకులపై అక్కడి నుంచి పారిపోయారు.సెంథిల్‌ కుమార్‌ హత్య విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి ఏ నమశ్శివాయం, బంధువులు, సుమారు700 మంది బీజేపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి వచ్చారు.

యూపీలో దారుణం, కొడుకు ఆరోగ్యం కోసం ఏడేళ్ల బాలుడు నరబలి, మంత్రగాడి మాటలు నమ్మి చిన్నారిని దారుణంగా గొంతు చేసి హత్య చేసిన కసాయి

చనిపోయిన సెంథిల్‌ను చూసి హోంమంత్రి నమశ్శివాయం, బంధువులు బోరున ఏడ్చారు. పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. సెంథిల్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు.

Here's Video

నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement