Mumbai Shocker: 18 నెల‌ల‌ కుమార్తెను చంపి శ్మ‌శానంలో పాతిపెట్టిన త‌ల్లిదండ్రులు, అజ్ఞాత వ్య‌క్తి రాసిన లేఖ‌తో బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు నిజం

చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్‌ చేశారు. (Couple Secretly Kills Daughter) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Representational Image (Photo Credits: Pexels)

Mumbai, April 11: దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమార్తెను రహస్యంగా చంపారు. చిన్నారి మృతదేహాన్ని శ్మశానవాటికలో పాతిపెట్టారు. అయితే దీని గురించి పోలీసులకు లేఖ అందింది. దీంతో దర్యాప్తు జరిపి ఆ భార్యాభర్తలను అరెస్ట్‌ చేశారు. (Couple Secretly Kills Daughter) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 38 ఏళ్ల జాహిద్ షేక్, 28 ఏళ్ల నూరామి భార్యాభర్తలు. వారికి 18 నెలల వయసున్న కుమార్తె లబీబా ఉంది. అయితే మార్చి 18న ఆ దంపతులు తమ కుమార్తెను హత్య చేశారు. స్థానిక శ్మశానవాటికలో రహస్యంగా పాతిపెట్టారు. కాగా, ఈ సంఘటన జరిగిన మూడు వారాల తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి రాసిన లేఖ స్థానిక పోలీసులకు అందింది. దీంతో దీనిపై దర్యాప్తు చేపట్టారు. పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆ పసి పాప తల, శరీరంపై గాయాలున్నట్లు తేలింది.

Haryana Road Accident: మద్యం మత్తులో స్కూలు బస్సును చెట్టుకు గుద్దిన డ్రైవర్, 5 గురు చిన్నారులు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు 

మరోవైపు ఆ చిన్నారి తల్లిదండ్రులైన జాహిద్ షేక్, నూరామిని పోలీసులు ప్రశ్నించారు. తొలుత కట్టుకథ చెప్పిన వారిద్దరూ తమ కుమార్తెను చంపినట్లు చివరకు ఒప్పుకున్నారు. అయితే ఎందుకు హత్య చేశారో అన్నది వెల్లడించలేదు. బుధవారం ఆ దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత తమ కస్టడీలోకి తీసుకున్నారు. పసి పాపను ఎందుకు చంపారో అన్నది ఆరా తీస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif