COVID19 in India: భారత్లో 9 వేలు దాటిన కోవిడ్ మరణాలు, గతంలో కంటే ఎక్కువగా ఒక్కరోజులో 11,929 కేసులు నమోదు, దేశంలో 3,20,922 కు పెరిగిన మొత్తం బాధితుల సంఖ్య
ప్రస్తుతం దేశంలో 1,49,348 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ప్రస్తుతం ఉన్న ఆక్టివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి...
New Delhi, June 14: భారతదేశంలో ఒకరోజును మించి ఒకరోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 11,929 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో ఒకరోజులో ఇంత పెద్దమొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 3,20,922 కు చేరింది. నిన్న ఒక్కరోజే 311 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,195 కు పెరిగింది.
నిన్న దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,049 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,62,379 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 1,49,348 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా ప్రస్తుతం ఉన్న ఆక్టివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి
S. No. | Name of State / UT | Active Cases* | Cured/Discharged/Migrated* | Deaths** | Total Confirmed cases* |
---|---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 5 | 33 | 0 | 38 |
2 | Andhra Pradesh | 2688 | 3195 | 82 | 5965 |
3 | Arunachal Pradesh | 83 | 4 | 0 | 87 |
4 | Assam | 2126 | 1584 | 8 | 3718 |
5 | Bihar | 2295 | 3956 | 39 | 6290 |
6 | Chandigarh | 54 | 286 | 5 | 345 |
7 | Chhattisgarh | 875 | 631 | 6 | 1512 |
8 | Dadra and Nagar Haveli and Daman and Diu | 33 | 2 | 0 | 35 |
9 | Delhi | 22742 | 14945 | 1271 | 38958 |
10 | Goa | 453 | 70 | 0 | 523 |
11 | Gujarat | 5707 | 15883 | 1448 | 23038 |
12 | Haryana | 3868 | 2803 | 78 | 6749 |
13 | Himachal Pradesh | 183 | 313 | 6 | 502 |
14 | Jammu and Kashmir | 2554 | 2269 | 55 | 4878 |
15 | Jharkhand | 887 | 816 | 8 | 1711 |
16 | Karnataka | 3095 | 3648 | 81 | 6824 |
17 | Kerala | 1342 | 1046 | 19 | 2407 |
18 | Ladakh | 368 | 68 | 1 | 437 |
19 | Madhya Pradesh | 2817 | 7377 | 447 | 10641 |
20 | Maharashtra | 51392 | 49346 | 3830 | 104568 |
21 | Manipur | 358 | 91 | 0 | 449 |
22 | Meghalaya | 21 | 22 | 1 | 44 |
23 | Mizoram | 106 | 1 | 0 | 107 |
24 | Nagaland | 87 | 76 | 0 | 163 |
25 | Odisha | 1119 | 2594 | 10 | 3723 |
26 | Puducherry | 92 | 82 | 2 | 176 |
27 | Punjab | 671 | 2327 | 65 | 3063 |
28 | Rajasthan | 2782 | 9337 | 282 | 12401 |
29 | Sikkim | 59 | 4 | 0 | 63 |
30 | Tamil Nadu | 18881 | 23409 | 397 | 42687 |
31 | Telangana | 2203 | 2352 | 182 | 4737 |
32 | Tripura | 730 | 315 | 1 | 1046 |
33 | Uttarakhand | 685 | 1077 | 23 | 1785 |
34 | Uttar Pradesh | 4858 | 7875 | 385 | 13118 |
35 | West Bengal | 5693 | 4542 | 463 | 10698 |
Cases being reassigned to states | 7436 | 7436 | |||
Total# | 149348 | 162379 | 9195 | 320922 |
ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో మూడింట ఒకవంతు ఒక్క మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. అది కూడా ఎక్కువగా ముంబై దాని చుట్టుపక్కల నగరాల నుంచి భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,04,568 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ రాష్ట్రంలో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,830 కు చేరుకుంది. ఒక్క ముంబై నగరంలోనే 56 వేలకు పైగా కోవిడ్ బాధితులున్నారు. కరోనావైరస్ కారణంగా ముంబైలో ఇప్పటివరకు 2100 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)