Coronavirus 4th Wave: ఢిల్లీలో మూడు దాటి 4వ దశలోకి చేరిన కరోనా, మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండని వేడుకుంటున్న సీఎం కేజ్రీవాల్, లాక్‌డౌన్‌ లేదు, జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచన

దేశంలో కరోనవైరస్ చాలా రాష్ట్రాల్లో మూడవ దశను దాటి నాలుగవ దశలోకి (Coronavirus 4th Wave) ప్రవేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాఫ్ట్రాల్లో కరోనా 4వ వేవ్ లోకి చేరింది. ఢిల్లీలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (CM Arvind Kejriwal) మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండి అంటూ ప్రజలను వేడుకున్నారు.

Coronavirus 4th Wave: ఢిల్లీలో మూడు దాటి 4వ దశలోకి చేరిన కరోనా, మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండని వేడుకుంటున్న సీఎం కేజ్రీవాల్, లాక్‌డౌన్‌ లేదు, జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచన
Arvind Kejriwal. (Photo Credits: IANS)

New Delhi, April 3: దేశంలో కరోనవైరస్ చాలా రాష్ట్రాల్లో మూడవ దశను దాటి నాలుగవ దశలోకి (Coronavirus 4th Wave) ప్రవేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాఫ్ట్రాల్లో కరోనా 4వ వేవ్ లోకి చేరింది. ఢిల్లీలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (CM Arvind Kejriwal) మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండి అంటూ ప్రజలను వేడుకున్నారు. కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌, ఇతర అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఢిల్లీలో కరోనా నాల్గవ వేవ్‌ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుంది. మార్చి 16న 425 కొత్త కేసులు నమోదయితే.. ఈ రోజు వాటి సంఖ్య 3,500కు చేరుకుంది. ప్రస్తుతానికి అయితే లాక్‌డౌన్‌ విధించే ఆలోచన మాత్రం లేదు. ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే.. మాస్క్ ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’’ అని ఢిల్లీ సీఎం వేడుకున్నారు.

దేశాన్ని వణికిస్తున్న సెకండ్ వేవ్, రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా, పేదలను భయపెడుతున్న లాక్‌డౌన్ ఊహగానాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వలస కార్మికులు

కోవిడ్-19 టీకా విషయంలో వయస్సు పరిమితులను తొలగించాలని.. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌ వేయడానికి ప్రభుత్వాన్ని అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్‌ కోరారు . "టీకాలు సురక్షితమే అనుకుంటే.. అన్ని వర్గాల ప్రజలకు వాక్సిన్‌ వేయడానికి కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతిస్తే.. యుద్ధ ప్రాతిపదికన వేలాది టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇది కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడుతుంది" అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

దేశంలో మళ్లీ కరోనా మృత్యుఘోష, నిన్న ఒక్కరోజే 714 మంది మృతి, తాజాగా 89,129 మందికి కరోనా పాజిటివ్, కేసులు పెరిగినా లాక్‌డౌన్‌ విధించేది లేదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వాలు

ఏప్రిల్‌లో కరోనా కేసుల సంఖ్య లెక్కకు మించి పెరగనున్నదని నిపుణులు అంటున్నారు. ఈనెల మధ్యనాటికల్లా కరోనా సెకెండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత దేశంలోని మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, కేరళ, ఛత్తీస్‌గడ్, చండీగఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా తదితర ప్రాంతాలలో అధికంగా ఉంది.

(The above story first appeared on LatestLY on Apr 03, 2021 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).