Kerala Road Accident: సీనీ ఇండస్ట్రీలో మరో ఘోర విషాదం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ మృతి, మిస్ కేరళ -2019 విన్నర్ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాబాన్‌లను కాటేసిన మృత్యువు

కేరళలోని కొచ్చి సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. సినిమా ఇండస్ట్రీలో కోటి కలలతో కెరీర్ మొదలు పెడుతున్న ఇద్దరమ్మాయిలు మిస్ కేరళ -2019 ( Miss Kerala 2019 ) విన్నర్ అన్సీ కబీర్ ( Ancy Kabeer ), రన్నరప్ అంజనా షాబాన్ ( Anjana Shajan ) ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు

Ancy Kabeer and Anjana Shajan (Photo Credit: Twitter)

కేరళలోని కొచ్చి సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. సినిమా ఇండస్ట్రీలో కోటి కలలతో కెరీర్ మొదలు పెడుతున్న ఇద్దరమ్మాయిలు మిస్ కేరళ -2019 ( Miss Kerala 2019 ) విన్నర్ అన్సీ కబీర్ ( Ancy Kabeer ), రన్నరప్ అంజనా షాబాన్ ( Anjana Shajan ) ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేర‌ళ‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాదం ఇప్పుడు ప‌లువుర్ని కంట‌త‌డి పెట్టిస్తుంది.

ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి వారి కారు అదుపుతప్పినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ (Former Miss Kerala Ancy Kabeer).తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ‘ఇట్స్​ టైమ్​ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్‌ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె పోస్ట్‌ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత కొద్దిగంట‌ల్లోనే ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణించింది. అయ్యో పాపం చనిపోయే విషయం ముందుగానే తెలిసిపోయినట్లు వెళ్లడానికి టైమ్ అయింది అంటూ రాసుకొచ్చిందేంటబ్బా అంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తూ..ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 5 మందికి గాయాలు, అందరూ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే

మిస్‌ కేరళ 2019 కాంపిటీషన్‌ నుంచి అన్సీ, అంజనా క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా మారారు. మిస్ కేర‌ళ విన్న‌ర్ అన్సీ క‌బీర్‌, ర‌న్న‌ర్ అంజ‌నా షాబాన్ ఇద్ద‌రూ మ‌రో ఇద్ద‌రు అబ్బాయిల‌తో కలిసి జాలీ ట్రిప్ వెళ్లారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున ఎర్నాకుళం బైపాస్ వ‌ద్ద ఒక బైక్‌ను త‌ప్పించ‌బోయి వాళ్లు ప్ర‌యాణిస్తున్న కారు అదుపుత‌ప్పింది. దీంతో అన్సీ, అంజ‌నా ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. వీరిలో ఒక యువ‌కుడికి స్వ‌ల్ప గాయాలు కాగా.. మ‌రో యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

నాన్నా నన్ను బయటకు తీయండి..బస్సు చక్రాల కింద పడి యువతి కన్నీటి రోదన, విశాఖ ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ వద్ద ఘో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

2019వ సంవ‌త్స‌రంలో జ‌రిగిన అందాల పోటీలో తిరువ‌నంత‌పురం అట్టింగ‌ల్‌లోని అలంకోడ్ కు చెందిన అన్సీ క‌బీర్ విజేత‌గా నిలిచింది. త్రిసూర్‌కు చెందిన అంజ‌నా షాజ‌న్ రన్న‌ర‌ప్‌గా నిలిచింది. సాధార‌ణంగా అందాల పోటీలో గెలిచిన అమ్మాయి అంటే పోటీలో పాల్గొన్న మిగిలిన అమ్మాయిల‌కు ప‌డ‌దు. కానీ ఆ అందాల పోటీలో అన్సీ, అంజ‌నా మ‌ధ్య మంచి స్నేహం కుదిరింది. ఇద్ద‌రూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అప్ప‌ట్నుంచి ఇద్ద‌రూ క‌లిసి ప‌లు ట్రిప్‌లు కూడా ఎంజాయి చేశారు. ఇప్పుడు కూడా అలాగే జాలీ ట్రిప్ న‌కు వెళ్లొస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగి ఇద్ద‌రూ ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన మ‌రో ఇద్ద‌రిని ఎర్నాకుళం మెడిక‌ల్ సెంట‌ర్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement