G20 Virtual Summit: ఇవాళ మోదీ అధ్యక్షతన జీ-20 లీడర్స్ వర్చువల్ సమావేశం, డుమ్మాకొట్టనున్న చైనా అధ్యక్షుడు

ఈ సదస్సులో కూటమిలోని వివిధ దేశాధినేతలు పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సదస్సులో పాల్గొంటారని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. అయితే, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈ సదస్సుకు డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది.

Prime Minister Narendra Modi. (Photo Credits: Twitter Video Grab)

New Delhi, NOV 22: ప్రధాని నరేంద్ర మోడీ (Modi) అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం వర్చువల్ జీ20 సదస్సు (G20 Virtual Summit) జరుగనుంది. ఈ సదస్సులో కూటమిలోని వివిధ దేశాధినేతలు పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా సదస్సులో పాల్గొంటారని ఆ దేశ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. అయితే, చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్‌ ఈ సదస్సుకు డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఈ వర్చువల్ G20 లీడర్స్ (G20 Virtual Summit) సదస్సు జరుగుతుంది. వర్చువల్ సమ్మిట్‌లో అనేక ప్రధానాంశాలు చర్చించనున్నారు. 2023లో గ్లోబల్ ఎకానమీ, ఫైనాన్స్, క్లైమేట్ ఎజెండా, డిజిటలైజేషన్ ఇతర అంశాలపై చర్చిస్తారు.

Ayodhya Ram Mandir Recruitment 2023: అయోధ్య రామమందిరంలో పూజారి పోస్టుకు 3 వేల మంది అప్లై, ఇంటర్యూకి సెలక్ట్ అయిన 200 మంది పూజారులు 

ఈ వర్చువల్ జీ20 సమ్మిట్ ప్రధాని అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్ అసెంబ్లీ హై-లెవల్ వీక్, SDG సమ్మిట్ 78వ సెషన్ తర్వాత ప్రపంచ నాయకుల ప్రధాన సమావేశం ఈ G20 వర్చువల్ సదస్సేనని విలేకరుల సమావేశంలో షెర్పా తెలిపారు. ఈ సదస్సుకు ఆఫ్రికన్ యూనియన్ ఛైర్మన్‌తోపాటు మొత్తం G20 సభ్యదేశాల నాయకులు, తొమ్మిది అతిథి దేశాలు, 11 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఆహ్వానించారు.