IPL Auction 2025 Live

Bihar: ఇదో వింత కేసు.. కారులో విదేశీ మద్యం, ఆడ కుక్కను అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు, ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించడమే కారణమంటున్న బక్సర్ జిల్లా పోలీసులు

ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఒక ఆడ కుక్కను పోలీసులు అరెస్ట్‌ (German Shepherd detained) చేశారు. బక్సర్ జిల్లాలో బీహార్ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు (violation of Excise Laws) ముఫాసిల్ పోలీసులు జర్మన్ షెపర్డ్‌ డాగ్‌ను అరెస్ట్ చేశారు.

German Shepherd (Photo-Facebook/German Shepherd Puppy Listings Near Me)

Patna, July 18: బీహార్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ఒక ఆడ కుక్కను పోలీసులు అరెస్ట్‌ (German Shepherd detained) చేశారు. బక్సర్ జిల్లాలో బీహార్ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు (violation of Excise Laws) ముఫాసిల్ పోలీసులు జర్మన్ షెపర్డ్‌ డాగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ నెల 6న బక్సర్‌ పోలీసులు రోడ్డుపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ నుంచి వస్తున్న ఎస్‌యూవీని ఆపి సోదా చేశారు. ఆ కారులో ఆరు విదేశీ మద్యం సీసాలు (Indian Made Foreign Liquor (IMFL) కనిపించాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న సతీశ్‌ కుమార్‌, భువనేశ్వర్ యాదవ్‌కు బ్రీత్‌ అనాలిసిస్‌ టెస్ట్‌ నిర్వహించారు. వారిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బీహార్‌లో మద్యాన్ని నిషేధించిన నేపథ్యంలో సంబంధిత ఎక్సైజ్ చట్టాల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. అలాగే వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

వర్షాలు కురవకపోవడానికి ఆ ఇంద్రుడే కారణం, దేవునిపై ఫిర్యాదు చేసిన యూపీ రైతు, సోషల్ మీడియాలో ఫిర్యాదు లేఖ వైరల్, లేఖపై స్పందించిన తహశీల్దార్

ఆ కారులో వారితో పాటు ఉన్న జర్మన్ షెపర్డ్‌ డాగ్‌ను బీహార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ (Bihar Excise and Prohibition Act) సెక్షన్ 57 కింద పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వాహనం లోపల దొరికిన కుక్కను కూడా చట్టంలోని సెక్షన్ 56(2) కింద జప్తు చేశారు. ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందన్న కారణంతో దానిని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆ కుక్కకు డాగ్‌ ఫుడ్‌ పెడుతున్నారు. అయితే ఆ జర్మన్ షెపర్డ్‌ కేవలం ఇంగ్లీష్‌ మాటలను మాత్రమే అర్థం చేసుకుంటున్నదని ఒక పోలీస్‌ అధికారి తెలిపారు.

దీంతో దానికి ఆ మేరకు సూచనలు ఇచ్చేందుకు ఇంగ్లీష్‌ తెలిసిన వ్యక్తి సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. జాతి కుక్కను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచడం ఖరీదైన వ్యవహారమని అన్నారు. చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం, మద్యం రవాణా చేసే ఏదైనా జప్తు చేయబడుతుంది. అలాగే సెక్షన్ 57 ప్రకారం, దొరికిన మత్తు పదార్థాలు కూడా జప్తు చేయబడతాయి. అరెస్టు అనంతరం సతీష్ కుమార్, భువనేశ్వర్ యాదవ్‌లను ఎక్సైజ్ చట్టాల ప్రకారం వ్యవహరించే ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.