IndiGo Goa Delhi Flight: 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. గోవాకు తిరిగివచ్చిన ఇండిగో విమానం
గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో గాలిలోనే ఇంజన్ వైఫల్యం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. మంగళవారం ఉదయం 9:15 గంటలకు మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి 'ఇండిగో 6E 2102' విమానం టేకాఫ్ అయింది.
IndiGo Goa Delhi Flight: గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో గాలిలోనే ఇంజన్ వైఫల్యం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి గోవా విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. మంగళవారం ఉదయం 9:15 గంటలకు మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి 'ఇండిగో 6E 2102' విమానం టేకాఫ్ అయింది. అయితే గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానంలోని ఒక ఇంజన్ పనిచేయడం లేదని గుర్తించిన పైలట్లు, ప్రామాణిక కార్యాచరణ విధానాలను అనుసరించి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
UPIతో PF డబ్బులు తీసుకోవచ్చా.. కొత్త వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.. మార్పులపై పూర్తి వివరణ..
విమానాశ్రయంలో కొద్దిసేపు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, పైలట్లు విమానాన్ని యు-టర్న్ తీసుకుని సురక్షితంగా గోవాలోనే ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఆ విమానానికి సాంకేతిక సిబ్బంది నిర్వహణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని తెలిపిన ఇండిగో యాజమాన్యం, ప్రయాణికులకు అల్పాహారం అందించడంతో పాటు వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసింది.
మరొక ఘటనలో దమ్మామ్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి సోమవారం గాలిలోనే బాంబు బెదిరింపు ఎదురైంది. విమానం మరుగుదొడ్డిలో 'బాంబ్' అని రాసి ఉన్న టిష్యూ పేపర్‌ను క్యాబిన్ సిబ్బంది కనుగొనడంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానాన్ని ప్రత్యేక బేలోకి తరలించి, అందులోని 32 మంది ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించి సమగ్ర భద్రతా తనిఖీలు చేపట్టారు.