Gujarat Shocker: వితంతువుతో అక్రమ సంబంధం, పెళ్లి మాట ఎత్తేసరికి ఆమెను గొంతు కోసి చంపేశాడు, గుజరాత్‌లో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక వితంతువు వివాహేతర సంబంధం కారణంగా కన్ను మూసింది. దారుణ ఘటన వివరాల్లోకెళితే...లందాపురా గ్రామ సమీపంలో హంస పర్మార్ (32) అనే వితంతువు శైలేష్ వాఘేలా అనే వివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Gandhi Nagr, Dec 13: వివాహేతర సంబంధాలు చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక వితంతువు వివాహేతర సంబంధం కారణంగా కన్ను మూసింది. దారుణ ఘటన వివరాల్లోకెళితే...లందాపురా గ్రామ సమీపంలో హంస పర్మార్ (32) అనే వితంతువు శైలేష్ వాఘేలా అనే వివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అయితే ఆమె తనను పెళ్లి చేసుకోమని వాఘేలాని ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ మేరకు వాఘేలాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండటంతో అందుకుఅతను అంగీకరించ లేదు. ఆమె మాత్రం వాఘెలా పై మరింతగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి (She Pressures Him to Marry Her) తీసుకువచ్చింది. దీంతో వాఘేలా కాలువ వద్ద కలుద్దాం అని పర్మార్‌ని పిలిచి గొంతు కోసి చంపి (Married Man Slits Paramour’s Throat) అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు స్థానికులు సావ్లి తాలూకాలోని కాలువ సమీపంలో ఒక మహిళ హత్యకు గురైందని పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారించడమే కాక నిందితుడు మంజుసర్ నివాసి శైలేష్ వాఘేలాగా గుర్తించి అరెస్టు చేశారు.