Man Lifts Bike (Credits: X)

Newdelhi, Mar 9: రైలు క్రాసింగ్ (Railway Crossing) వద్ద గేటు వేస్తే కొందరు సెకన్ల వ్యవధి కూడా వెయిట్ చెయ్యలేరు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. రైలు గేటు వేసినా కూడా కొందరు అడ్డదిడ్డంగా దాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోతుంటారు. మరికొందరు అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైల్వే గేటు వద్ద చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. రైల్వే క్రాసింగ్‌ వద్ద వేచి ఉండటాన్ని ఒక బైకర్‌ (Biker) సహించలేకపోయాడు.

బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)

Here's Video:

అమాంతం భుజంపైకి..

దీంతో తన బైక్‌ ను అమాంతం భుజంపైకి ఎత్తాడు. దానిని మోసుకుంటూ గేటు పక్క నుంచి నడిచి వెళ్లాడు. రైలు పట్టాలు దాటిన తర్వాత భుజంపై ఉన్న బైక్‌ ను కిందకు దించాడు. ఆ తర్వాత ఆ బైక్‌ పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది అన్నది తెలియలేదు. కాగా, ఒకరు రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బరువైన బైక్‌ ను చాలా సులువుగా పైకి ఎత్తి భుజంపై అతడు మోయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఫిట్‌ నెస్‌ ను కొందరు ప్రశంసించారు. రైల్వే ట్రాక్‌ వద్ద ప్రమాదకరంగా వ్యవహరించిన అతడిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్‌ చేశారు.

నేడే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవిగో..!