Guwahati Murder Case: భార్య తలను నరికి ఫ్రిజ్‌లో పెట్టిన భర్త.. మిగతా శరీర భాగాలను కుక్కలకు తినిపించిన కసాయి..గౌహతిలో దారుణ ఘటన వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్..
అసోం రాజధాని గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలో అత్యంత ఘోరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనుమానంతో 25 ఏళ్ల భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.
Guwahati Murder Case: అసోం రాజధాని గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలో అత్యంత ఘోరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనుమానంతో 25 ఏళ్ల భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. బసిష్ఠాపూర్ బైలేన్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ భయంకర నేరానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు రామానుజన్ గోస్వామి.. హత్య అనంతరం హతిగావ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
అపార్ట్‌మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రాక్షస క్రూరత్వం బయటపడింది. వెంటనే రెస్క్యూ టీమ్‌తో వచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులకు రక్తపు మరకలు, చెల్లాచెదురుగా ఉన్న గృహోపకరణాలు, మద్యం సీసాలు, దాడికి ఉపయోగించిన పదునైన ఆయుధం కనిపించాయి. దర్యాప్తులో బాధితురాలు రియా తలుక్దార్ గోస్వామి తలను నరికి, నల్లటి ప్లాస్టిక్ సంచిలో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లు గుర్తించారు. ఆమె వేళ్లను, శరీర భాగాలను ముక్కలుగా నరికి పాక్షికంగా దుస్తులు లేని స్థితిలో వదిలేశారు. బాధితురాలి మాంసపు ముక్కలను నిందితుడు స్థానిక వీధి కుక్కలకు తినిపించినట్లు వస్తున్న కథనాలు స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
స్కూళ్లోనే రాసలీలల దుకాణం పెట్టేసిన ప్రధానోపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలితో పాఠశాలలోనే శృంగారం..
పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులను కోల్పోయిన రియా ఫ్యాన్సీ బజార్‌లోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామానుజన్‌ను ఆరు నెలల క్రితం వివాహం చేసుకుంది. మాదకద్రవ్యాల వ్యసనపరుడైన రామానుజన్ ఇటీవల పునరావాస కేంద్రం నుంచి వచ్చాడు. భార్యపై ఉన్న తీవ్రమైన అనుమానాలే వారి మధ్య గొడవలకు, తద్వారా ఈ హత్యకు దారితీశాయి. ఫోరెన్సిక్ ఆధారాల ప్రకారం మృతదేహం దొరికిన 24 నుంచి 48 గంటల ముందే ఈ దారుణం జరిగింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గౌహతి మెడికల్ కాలేజీకి తరలించారు.
ఫోరెన్సిక్ బృందాలు, నేర పరిశోధన విభాగం (CID) సంఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించి కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి. రామానుజన్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, బాధితురాలికి మిగిలి ఉన్న ఏకైక సోదరుడి కోసం గాలింపు వేగవంతం చేశారు.