Gym Tragedy in Assam: వీడియో ఇదిగో.. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు.. కుప్పకూలి నగావ్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ మృతి..
శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి చేసే వ్యాయామమే కొందరి ప్రాణాల మీదికి తెస్తోంది. ఇటీవల కాలంలో జిమ్‌లలో వర్కవుట్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అసోంలోని నగావ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 47 ఏళ్ల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాహిన్ రెహమాన్, జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.
Gym Tragedy in Assam: శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి చేసే వ్యాయామమే కొందరి ప్రాణాల మీదికి తెస్తోంది. ఇటీవల కాలంలో జిమ్‌లలో వర్కవుట్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అసోంలోని నగావ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 47 ఏళ్ల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షాహిన్ రెహమాన్, జిమ్‌లో వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.
కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ షాహిన్ రెహమాన్.. ఆగస్టు 27 రాత్రి జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. సహచరులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గతంలో కూడా చంపావత్ జిల్లాలో 38 ఏళ్ల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారి గిరీష్ భట్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. అలాగే చించ్‌వాడ్ ప్రాంతంలో 6 నెలలుగా క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తున్న 37 ఏళ్ల వ్యాపారవేత్త మిలింద్ కులకర్ణి వర్కవుట్ మధ్యలో నీళ్లు తాగి, కళ్లు తిరిగి పడిపోయి మరణించారు.
Doctor Collapses During Workout at Gym in Assam
వైద్య నిపుణుల హెచ్చరిక..
సాధారణంగా వ్యాయామం గుండె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, తగినంత విశ్రాంతి లేకపోవడం లేదా తీవ్రమైన వ్యాయామం (Strenuous Exercise) చేయడం అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా..
1. గుర్తించని గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిలో అధిక శ్రమ గుండెపోటును ప్రేరేపిస్తుంది.
2. జిమ్‌లో భారీ వర్కవుట్లు ప్రారంభించే ముందు గుండె ఆరోగ్య తనిఖీలు (Heart Check-ups) చేసుకోవడం అవసరం.
3. శారీరక శ్రమ మధ్యలో మైకం, కళ్లు తిరగడం, లేదా ఛాతీలో అసౌకర్యం అనిపిస్తే వెంటనే వ్యాయామాన్ని నిలిపివేసి వైద్యులను సంప్రదించాలి.