Coronavirus in Indian Army

New Delhi, May 12: దేశంలో కరోనా తీవ్రత (India COVID-19) రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య (Coronavirus Count in India) 70,756కి పెరిగింది. గత 24 గంటల్లో 3604 కరోనా కేసులు నమోదవగా, కొత్తగా 87 మంది బాధితులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య (Coronavirus Deaths) 2293కి చేరింది. రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్

ఈ వైరస్‌ బారిన పడినవారిలో 22,455 మంది బాధితులు కోలుకోగా, మరో 46,008 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ సగటున రోజుకు 1073 కేసులు నమోదవగా, మే తొలి 11 రోజుల్లో 3409 కరోనా కేసులు రికార్డయ్యాయి. దేశంలో రికవరీ రేటు31.15 శాతానికి పెరిగింది.

తాజా గణాంకాల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు అయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 23,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 868 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 8,542 పాజిటివ్ కేసులు ఉండగా, 513 మంది మృతి చెందారు. తమిళనాడులో 8,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు. అలాగే ఢిల్లీలో 7,233 పాజిటివ్ కేసులు, 73 మంది మృతి చెందారు. రాజస్తాన్‌లో 3,988 పాజిటివ్ కేసులు, 113 మంది మృతి చెందారు.

Here's the COVID-19 Tally State-wise in India:

S. No. Name of State / UT Total Confirmed cases* Cured/Discharged/Migrated Deaths**
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 2018 975 45
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 65 34 2
5 Bihar 747 377 6
6 Chandigarh 174 24 2
7 Chhattisgarh 59 53 0
8 Dadar Nagar Haveli 1 0 0
9 Delhi 7233 2129 73
10 Goa 7 7 0
11 Gujarat 8541 2780 513
12 Haryana 730 337 11
13 Himachal Pradesh 59 39 2
14 Jammu and Kashmir 879 427 10
15 Jharkhand 160 78 3
16 Karnataka 862 426 31
17 Kerala 519 489 4
18 Ladakh 42 21 0
19 Madhya Pradesh 3785 1747 221
20 Maharashtra 23401 4786 868
21 Manipur 2 2 0
22 Meghalaya 13 10 1
23 Mizoram 1 1 0
24 Odisha 414 85 3
25 Puducherry 12 6 0
26 Punjab 1877 168 31
27 Rajasthan 3988 2264 113
28 Tamil Nadu 8002 2051 53
29 Telengana 1275 800 30
30 Tripura 152 2 0
31 Uttarakhand 68 46 1
32 Uttar Pradesh 3573 1758 80
33 West Bengal 2063 499 190
Total number of confirmed cases in India 70756# 22455 2293

మధ్యప్రదేశ్‌లో 3,785 పాజిటివ్ కేసులు, 221 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లో 3,573 పాజిటివ్ కేసులు, 80 మంది మృతి చెందారు. పశ్చిమబెంగాల్‌లో 2,063 పాజిటివ్ కేసులు, 190 మంది మృతి చెందారు. పంజాబ్‌లో 1,877 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి చెందారు. జమ్మూకశ్మీర్‌లో 879 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి చెందారు. కర్ణాటకలో 862 పాజిటివ్ కేసులు, 31 మంది మృతి చెందారు. హర్యానాలో 730 పాజిటివ్ కేసులు, 13 మంది మృతి చెందారు. తెలంగాణలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు, కొత్తగా 79 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనివే, రాష్ట్రంలో 1275కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య

భారతదేశం ప్రస్తుతం కొనసాగుతున్న మూడవ దశ లాక్డౌన్ మధ్యలో ఉంది. ఇది మే 17 తో ముగుస్తుంది. పిఎం నరేంద్ర మోడీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి, లాక్డౌన్ నిష్క్రమణ వ్యూహం మరియు ఎలా చేయాలో చర్చించారు. అలాగే లాక్డౌన్ యొక్క పొడిగింపు ఉంటుందని నరేంద్ర మోడీ సీఎంలతో అన్నట్లుగా తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ 4లో గత దానికంటే సడలింపులు ఎక్కువగా ఉండవచ్చు.