Coronavirus in India: కరోనా రెండోసారి వస్తే సీరియస్ ఏమి కాదు, దేశంలో తాజాగా 90,123 మందికి కరోనా, 50,20,360 కు చేరుకున్న మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, 82,961 కు చేరిన మరణాల సంఖ్య

భారత్‌లో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు (Coronavirus in India) నమోదవుతున్నాయి. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Pandemic) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు (Coronavirus Deaths) చేరింది

Coronavirus in India: కరోనా రెండోసారి వస్తే సీరియస్ ఏమి కాదు, దేశంలో తాజాగా 90,123 మందికి కరోనా, 50,20,360 కు చేరుకున్న మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య, 82,961 కు చేరిన మరణాల సంఖ్య
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, September 16: భారత్‌లో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు (Coronavirus in India) నమోదవుతున్నాయి. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 Pandemic) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,961 కు (Coronavirus Deaths) చేరింది.

వైరస్‌ బాధితుల్లో సోమవారం ఒక్కరోజే 82,961 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 39,42,360. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,95,933. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. భారత్‌లో కరోనా రోగుల రికవరీ రేటు 78.53 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.63 శాతంగా ఉందని వెల్లడించింది.

ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో యాక్టివ్‌ కేసుల రేటు 19.84 శాతంగా ఉందని పేర్కొంది. ఇక గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,16,842 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 5,94,29,115 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొంది.

మాస్క్ ధరించండి. ప్రాణాలు కాపాడండి: కరోనా వైరస్ ఆపడానికి సహకరించండి, కోవిడ్-19 నివారణ చర్యల కోసం గూగుల్ డూడుల్ సరికొత్తగా వ్యూయర్స్ ముందుకు..

కరోనా ఒకసారి వచ్చి తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలో కరోనా తిరిగి సోకుతున్న కేసులు వస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్‌లో రెండోసారి వస్తున్న కరోనా గురించి∙సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రష్యా వ్యాక్సిన్‌ గురించి మాట్లాడుతూ వారు తయారు చేసిన వ్యాక్సిన్‌ మూడో దశ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు.

అయితే శరీరంలో యాంటీబాడీలను పెంచడంలో అది 76 శాతం మందిలో సానుకూల ప్రభావాన్ని చూపినట్లు లాన్సెట్‌ జర్నల్‌ లో ప్రచురితమైందన్నారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మన దేశంలోనే రికవరీలు జరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ చెప్పారు.

(The above story first appeared on LatestLY on Sep 16, 2020 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).