Jammu and Kashmir: జవాన్లపై తుఫాకులతో విరుచుకుపడిన ఉగ్రవాదులు, జవాన్ల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం, జమ్మూకశ్మీరులోని షోపియాన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌, అఫ్గానిస్తాన్‌లో భారత్ ఆస్తులను టార్గెట్ చేసిన ఐఎస్‌ఐ

జమ్మూకశ్మీరులోని షోపియాన్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Shopian Enounter) ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ ప్రాంతంలోని సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర సోమవారం తెల్లవారుజామున కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

Enounter Representational Image (Photo Credits: PTI)

Shopian, July 19: జమ్మూకశ్మీరులోని షోపియాన్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Shopian Enounter) ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ ప్రాంతంలోని సాథిక్ ఖాన్ ఏరియాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర సోమవారం తెల్లవారుజామున కేంద్ర భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. గాలిస్తున్న జవాన్లపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు (Two Terrorists Killed in Shopian Enounter) మరణించారు. మృతుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండరు ( Top LeT Commander) ఇష్ఫాఖ్ దార్ అలియాస్ అబూ అక్రం ఉన్నారని, ఇతను 2017 వ సంవత్సరం నుంచి ఉగ్రవాద సంస్థలో పనిచేస్తున్నాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయకుమార్ చెప్పారు.

ఈ పరిస్థితుల మధ్య పాకిస్థాన్‌ గూఢచర్యసంస్థ ఐఎస్‌ఐ మరో కుట్రకు తెర లేపిందని వార్తలు వస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌లో భారత్‌ ఆస్తులను.. ప్రాజెక్టులను లక్ష్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పది వేల మంది సాయుధులను అఫ్గాన్‌కు పంపింది. ‘‘తాలిబన్లకు మద్దతుగా భారీ సంఖ్యలో పాక్‌ సాయుధులు అఫ్గాన్‌లోకి ప్రవేశించారు. భారత ఆస్తులను, భవనాలను లక్ష్యంగా చేసుకోవాలని వీరికి సూచనలు ఇచ్చారు’’ అని అఫ్గాన్‌లో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత్‌ వర్గాలు తెలిపాయి.

అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురు మృతి, మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌ు, వాషింగ్టన్‌ డీసీలోని బేస్‌బాల్‌ స్టేడియం వెలుపల కాల్పులకు తెగబడిన దుండుగులు

గత కొన్ని నెలలుగా అఫ్గాన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లోని భారత్‌ ఆస్తులను ధ్వంసం చేయాలని పాక్‌ భావిస్తోంది. అందుకే సాయుధ మూకలను పంపింది. తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాల్లో వీరు భారత్‌ ప్రాజెక్టులపై దాడి చేస్తారు. 2001 నుంచి అఫ్గాన్‌ పునర్నిర్మాణంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 300 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ దేశ పార్లమెంటును నిర్మించింది. ప్రతి ప్రావిన్స్‌లో పాఠశాలలు, రహదారుల నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.

అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులు, తాలిబన్ల మధ్య కతార్‌ రాజధాని దోహాలో శనివారం ప్రారంభమైన చర్చలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే తాలిబన్లు ఓ వైపు ప్రభుత్వ దళాలపై దాడులు చేస్తూ, కీలక ప్రాంతాలను ఆక్రమిస్తున్న నేపథ్యంలో చర్చల పురోగతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్‌ నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక పరంగా తాము ముందంజలో ఉన్నా.. తమకు రాజకీయ పరిష్కారమే కావాలని తెలిపారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్‌ వ్యవస్థను స్థాపించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement