US Shooting: అమెరికాలో కాల్పుల కలకలం, నలుగురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు, వాషింగ్టన్ డీసీలోని బేస్‌బాల్ స్టేడియం వెలుపల కాల్పులకు తెగబడిన దుండుగులు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తి 12 రౌండ్లు కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఓ వ్యక్తి 12 రౌండ్లు కాల్పులు జరిపి కలకలం రేపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. వాషింగ్టన్‌లోని నేషనల్స్ పార్క్ బేస్‌బాల్ మైదానంలో మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల చప్పుడు వినపడగానే కొందరు ప్రేక్షకులు మైదానం నుంచి బయటకు పరుగులు తీయగా, ఆటగాళ్లు కూడా పిచ్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాల్పులకు తెగబడిన వ్యక్తికోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు.
Two people shot outside Washington Nationals baseball stadium https://t.co/V0VjOm3Me6 pic.twitter.com/IOSaBGOErf
— Reuters (@Reuters) July 18, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 18, 2021 03:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

