హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆ బాలిక దినచర్యను తెలుసుకుని నిత్యం ఆమె రాక కోసం వేచి చూస్తున్నాడని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు

బాలిక సంఘటన స్థలానికి రావడానికి కొద్దిసేపటి ముందు నిందితుడు ఆ ప్రాంతానికి వచ్చి వేచి చూస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు.ఈ కాల్పుల్లో బాలికకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తి తనకు తెలుసని, ఎన్నో రోజుల నుంచి తనను అనుసరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని బాలిక తెలిపింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఆయుధాన్ని సంఘటన స్థలంలోనే పారవేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Faridabad Girl Shooting Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)