Kerala Shocker: వీడు మనిషేనా.. నాలుగేళ్ల కూతురు ముందే భార్యతో సె*క్స్.. అనంతరం ఆ వీడియో అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్.. నిందితుడిని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు..
తన భార్యకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడమే కాకుండా.. వారి నాలుగేళ్ల కుమార్తె ఎదుటే లైంగిక చర్యలకు పాల్పడిన తీవ్ర ఆరోపణలపై కేరళలోని కొట్టియంలో 31 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Kerala Shocker: తన భార్యకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడమే కాకుండా.. వారి నాలుగేళ్ల కుమార్తె ఎదుటే లైంగిక చర్యలకు పాల్పడిన తీవ్ర ఆరోపణలపై కేరళలోని కొట్టియంలో 31 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మయ్యనాడ్‌కు చెందిన నిందితుడు గతంలో తన కుటుంబంతో కలిసి యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లో నివసించి కేరళకు తిరిగి వచ్చాడు.
విదేశాల్లో ఉన్న సమయంలో బాధితురాలికి సంబంధించిన సన్నిహిత వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయని ఆమె స్నేహితులు హెచ్చరించడంతో ఈ విచారకర ఉదంతం బయటపడింది. భార్య నిలదీసి అతడి మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా.. చిన్నారి సమక్షంలోనే అతడు లైంగిక చర్యకు పాల్పడుతున్న ఫుటేజ్ లభించింది. అనంతరం కుటుంబం కేరళకు తిరిగొచ్చాక నిందితుడికి కౌన్సెలింగ్ ఇప్పించినప్పటికీ, అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఆ తర్వాత కూడా చిన్నారితో కూడిన మరో వీడియోను రికార్డ్ చేయడంతో భార్య తీవ్రంగా నిరసించింది. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై భౌతిక దాడికి దిగడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రిలోనే బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని ప్రాథమిక అభియోగాలు మోపారు.
వీడియో సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట, పోలీసులు కేసు తీవ్రతను బట్టి పిల్లలపై లైంగిక నేరాల రక్షణ చట్టం (POCSO) కింద కూడా అదనపు అభియోగాలు నమోదు చేశారు. కేసు తీవ్రత గ్రహించిన నిందితుడు కొద్దికాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ, పోలీసులు చాకచక్యంగా అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశాంత్ వి. కురుప్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఇంజనీరింగ్ చదువు మధ్యలోనే ఆపేసి భార్యతో కలిసి యూకే వెళ్లాడని, భార్యలను మార్చుకునే (Wife Swapping) సంస్కృతిలో పాల్గొనాలని కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చాడని వెల్లడించారు. స్థానిక అధికారులు ప్రాథమిక విచారణలో కొంత ఆలస్యం చేయడంతో బాధితురాలు కేరళ హైకోర్టును ఆశ్రయించిందని, న్యాయస్థానం జోక్యంతోనే దర్యాప్తు వేగవంతమై అరెస్టు వరకు వచ్చిందని న్యాయవాది స్పష్టం చేశారు.