Madhya Pradesh Shocker: ప్రియురాలిపై పగ...ఆమెతో పాటు కుటుంబంలో నలుగురిని గొంతు కోసి 10 అడుగుల గొయ్యిలో పాతిపెట్టిన ప్రియుడు, జేసీబీ ద్వారా అస్థిపంజరాలను బయటకు తీసిన పోలీసులు, మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో దారుణ ఘటన
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దేవాస్ జిల్లాలో (Dewas district) దారుణ ఘటన చోటు చేసుకుంది. మాజీ లవర్ తన భార్య ఫోటో, ఫోన్ నంబర్‌ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిందనే కోపంతో.. ప్రియుడు ఆమె కుటుంబంలోని నలుగురిని హత్య చేశాడు. వారందరిని పోలంలో పది అడుగుల లోతులో (10-foot-deep pit) పాతి పెట్టాడు.
Dewas, June 30: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దేవాస్ జిల్లాలో (Dewas district) దారుణ ఘటన చోటు చేసుకుంది. మాజీ లవర్ తన భార్య ఫోటో, ఫోన్ నంబర్‌ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిందనే కోపంతో.. ప్రియుడు ఆమె కుటుంబంలోని నలుగురిని హత్య చేశాడు. వారందరిని పోలంలో పది అడుగుల లోతులో (10-foot-deep pit) పాతి పెట్టాడు.
ఈ ఘటన గత నెలలో జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన వివరాల్లోకెళితే..ఇండియా టుడే కథనం ప్రకారం మధ్యప్రదేశ్ నేమవర్ పట్టణానికి చెందిన రూపాలి అనే యువతి, అదే ప్రాంతానికి చెందిన సురేంద్ర చౌహాన్ అనే వ్యక్తి ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల పాటు బాగానే సాగినా ఆ తర్వాత సురేంద్ర ప్రేయసిని కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయంలో ప్రియురాలు రూపాలికి తెలిసింది. దీంతో ఆగ్రహించిన రూపాలి సురేంద్ర చేసుకోబోయే యువతి ఫోటో, ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ విషయం కాస్త సురేంద్రకు తెలియడంతో ఎలాగైనా రూపాలి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. స్నేహితులను కలిసి తన ప్లాన్ వివరాలను తెలిపాడు. దానిలో భాగంగా ఈ ఏడాది మే 13న రూపాలి సోదరుడు పవన్ ఓస్వాల్(13)ని కలిసి.. మమతా బాయి కాస్తే (45), ఆమె కుమార్తెలు రూపాలి (21), దివ్య (14) తో పాటు బంధువుల అమ్మాయి పూజా ఓస్వాల్ (15)ని, తాను చెప్పిన ప్రాంతానికి తీసుకువచ్చేలా ఒప్పించాడు. వారంతా అక్కడకు చేరుకున్న తర్వాత సురేంద్ర వారిని గొంతు కోసి హత్య చేసి.. సమీప పొలంలో పది అడుగులు గొయ్యి తీసి.. మృతదేహాలను పూడ్చిపెట్టాడు. మృతదేహాలను ఉప్పు మరియు యూరియాతో కప్పారు.
రూపాలితో పాటు మిగతవారు కనిపించకపోవడంతో (Bodies of five missing since May) కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కేసును పక్కదోవ పట్టించడం కోసం సురేంద్ర, రూపాలి సోషల్ మీడియా నుంచి ఆమెలా పోస్టులు చేస్తుండేవాడు. తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని.. వేరే ప్రాంతంలో ఉంటున్నానని.. మిగతా కుటుంబ సభ్యులు తన దగ్గరే ఉన్నారని మెసేజ్‌లు చేసేవాడు.
అయితే మెసేజ్‌లపై పోలీసులకు అనుమానం రావడంతో రూపాలి కాల్ లిస్ట్ చెక్ చేశారు. దానిలో సురేంద్ర నంబర్‌కు ఎక్కువ సార్లు కాల్ చేసినట్లు ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు విచారణలో అతను దిమ్మతిరిగే విషయాలను వెల్లడించాడు. తాను రూపాలిని ప్రేమించానని.. కానీ ప్రస్తుతం వేరే యువతితో పెళ్లికి సిద్ధపడ్డానని. ఇందుకు రూపాలి అంగీకరించలేదని తెలిపాడు.
ఇందులో భాగంగానే రూపాలి బతికుంటే ఎప్పటికైనా ప్రమాదామే అని భావించి ఆమెను, ఆమెతో పాటు తమ ప్రేమ గురించి తెలిసిన మిగతా వారిని చంపేశానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు సురేంద్రతో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. మృతదేహాలను పూడ్చిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు జేసీబీ ద్వారా అస్థిపంజరాలను బయటకు తీశారు.
మృతదేహాలను వెలికి తీసిన వ్యవసాయ క్షేత్రం (agricultural field) చౌహాన్ కు చెందినది. ఇతర నిందితుల్లో అతని తమ్ముడు, ఇద్దరు స్నేహితులు మరియు ఈ క్షేత్రంలో పనిచేసిన ఇద్దరు కార్మికులు ఉన్నారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సూర్యకాంత్ శర్మ తెలిపారు.చౌహాన్ హత్యలను ప్లాన్ చేసి అమలు చేయగా, మరో ఐదుగురు బాధితులు ఖననం చేసిన గుంటలను తవ్వడంలో అతనికి సహాయపడ్డారు "అని దేవాస్ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ శివ దయాల్ సింగ్ అన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 30, 2021 01:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

