Medak Farmers Protest: రైతుల ఘోష వినలేదనే కోపంతో శివంపేట్ తహశీల్దార్‌పై డీజిల్ పోసిన రైతు, తరువాత తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం, పక్కనే ఉన్న రైతులు అలర్ట్ కావడంతో తప్పిన ప్రాణాపాయం
Farmer angry in Medak district Protest by pouring diesel on Shivampet Tahsildar along with him (Photo-Video Grab)

Medak, June 29: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోని మెదక్‌ జిల్లాలో రైతుల ఆగ్రహం (Medak Farmers Protest) కట్టలు తెంచుకుంది. ఓ రైతు కోపంతో.. తనపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా..ఆపై తహశీల్దార్‌పై కూడా డీజెల్ పోసి హత్యాయత్నం (pouring diesel on Shivampet Tahsildar) చేయబోయాడు. పక్కనే ఉన్న రైతులు అప్రమత్తం అవ్వడంతో ఎవరికి ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఘటన వివరాల్లోకెళితే.. తాళ్లపల్లిగడ్డ తండాకు చెందిన మాలోతు బాలు అనే రైతు విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడు.అయితే ఆ రైతుకు సకాలంలో తహశీల్దార్ భానుప్రకాశ్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో రైతు బీమా నగదు పొందలేకపోయారు. దీంతో ఆగ్రహంచిన మరో రైతు గ్రామంలోని మిగిలిన రైతులతో కలిసి మండల ఆఫీసుకు చేరుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం ముందు మృతదేహాన్ని ఉంచి నిరసన (Farmer angry in Medak district) వ్యక్తం చేశారు. తహశీల్దార్‌ నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందంటూ రైతులు కోపోద్రిక్తులయ్యారు.

ఇదే క్రమంలో ఓ రైతు వెంట తెచ్చుకున్న డీజిల్‌ బాటిల్‌ను ముందుగా తనపై పోసుకున్నాడు. అప్పటికే రైతులను తహశీల్దార్‌ సముదాయించే యత్నం చేస్తున్నారు. అయినా వినిపించుకోలేదు. ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగే క్రమంలో.. ఆ రైతు మిగతా డీజిల్‌ను తహశీల్దార్‌పై పోశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌..రాబోయే నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు, అవసరమైతే మరో రూ. 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధం, సీఎం దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్

రైతు విద్యుదాఘాతంతో మృతిచెందడంతో ఇప్పుడా కుటుంబం వీధిన పడిందని వాపోయారు రైతులు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని గ్రామస్థులతో కలిసి ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. వీరిని పట్టించుకోకుండా తహశీల్దార్ భానుప్రకాశ్ కార్యాలయం నుంచి బయటకు వెళ్తుండటంతో ఆగ్రహించిన రైతు డీజిల్ పోశాడని ఘటన పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవదహన సంఘటన తెలంగాణలో కలకలం రేపిన సంగతి విదితమే.