Man Beaten To Death: గురుద్వారాలో దొంగతనం చేశాడంటూ వ్యక్తిని కొట్టి చంపిన జనం, చేతులు కట్టేసి దారుణంగా కొట్టడంతో మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ఒక వ్యక్తి గురుద్వారాలో దొంగతనం (Man Accused Of Theft ) చేసినట్లు జనం ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడ్ని కట్టేసి కొట్టి చంపారు. (Man beaten to death) పంజాబ్‌లోని మోగా (Moga) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్‌ 16న గురుసర్ మడి గ్రామానికి చెందిన కరమ్ సింగ్‌ను (Karam Singh) కొందరు గ్రామస్తులు ఆసుపత్రిలో చేర్చారు.

Man Beaten To Death (PIC@ Viral Video)

Chandigarh, OCT 28: ఒక వ్యక్తి గురుద్వారాలో దొంగతనం (Man Accused Of Theft ) చేసినట్లు జనం ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడ్ని కట్టేసి కొట్టి చంపారు. (Man beaten to death) పంజాబ్‌లోని మోగా (Moga) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్‌ 16న గురుసర్ మడి గ్రామానికి చెందిన కరమ్ సింగ్‌ను (Karam Singh) కొందరు గ్రామస్తులు ఆసుపత్రిలో చేర్చారు. స్థానిక గురుద్వారాలో చోరీకి పాల్పడి పారిపోతుండగా తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. అయితే గ్రామ పెద్దలు, స్థానికుల ఒత్తిడితో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

 

కాగా, కరమ్‌ సింగ్‌ మరణించిన పది రోజుల తర్వాత అతడ్ని కట్టేసి దారుణంగా కొట్టిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral Video) అయ్యింది. స్థానికంగా ఇది కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరో 16 మంది పేర్లను కూడా చేర్చి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement