Rape On Woman: భర్త పరాయి మహిళపై అత్యాచారం చేస్తుంటే, దగ్గరుండి ప్రోత్సహిస్తూ, వీడియో తీసిన భార్య, ఆపై బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో, ఏం జరిగిందంటే..

తన భర్త అలా చేస్తుండగా ఆ భార్య ఫోటోలు, వీడియోలు తీసింది. వాటిని చూపించి ఇంకో రోజు మళ్లీ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ పిల్లల్ని చంపేస్తామని, ఈ ఫోటోలు అందరికీ చూపించి మీ పరువు తీస్తామని బెదిరించారు.

Representational Image (Photo Credits: File Image)

కట్టుకున్న భర్త పరాయి మహిళను రేప్ చేస్తుంటే అతడి భార్యనే దగ్గరుండి వీడియో తీసిన ఘటన కలకలం రేపుతోంది. భార్యాభర్తలిద్దరూ కలిసి మరో వివాహితపై దాడి చేసి, భర్త అత్యాచారం చేస్తుండగా ఆ భార్య వీడియో తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని మంగుళూరులో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ బాధితురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మంగుళూరులో నిందితులు ఇద్దరు భార్య భర్తలు జీవిస్తున్నారు. భర్త కేటరింగ్ పని చేసుకుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరి ఎదురుగా ఉండే ఇంట్లో బాధితురాల తన భర్తతో కలిసి ఉంటోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా బెంగుళూరులో నివసిస్తున్నాడు. గతవారం బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో ఇంట్లో నిద్రొస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు ఇంట్లోకి చొరబడిన నిందితులైన భార్యాభర్తలు ఆ మహిళకు మత్తు మందు మొహంపై చల్లి, నోరు మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు.

జమ్ముకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ చీతా హెలికాప్టర్‌, పైలట్‌, కో పైలట్‌ పారాచూట్‌ ద్వారా బయటపడినట్లు వార్తలు, వారిని గాలిస్తున్న ఆర్మీ రెస్క్యూ బృందాలు

ఆ తర్వాత నిందితుడు బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. తన భర్త అలా చేస్తుండగా ఆ భార్య ఫోటోలు, వీడియోలు తీసింది. వాటిని చూపించి ఇంకో రోజు మళ్లీ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ పిల్లల్ని చంపేస్తామని, ఈ ఫోటోలు అందరికీ చూపించి మీ పరువు తీస్తామని బెదిరించారు. ఇదిలా ఉండగా తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని ఆ మహిళపై ఇంకా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. దీంతో ఆ ఇద్దరు భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif