Wife Cheats Husband: తల్లి లాంటి వదినతో మరిది శృంగార లీలలు, అన్న వద్దని వారించిన వినకుండా, రాసక్రీడల్లో మునిగితేలాడు, తమ్ముడి మోసం తట్టుకోలేక అన్న ఏం చేశాడంటే..
ఈ విషయం కాస్త.. అన్నకు తెలియడంతో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఏకంగా తమ్ముడిపై హత్యాయత్నం చేసేంతలా దాడి జరిగింది.
నాగర్ కోయిల్, మార్చి 23: అన్న భార్య.. వదినని తల్లితో సమానంగా చూసే సమాజం మనది. అలాంటి సమాజంలో ఉండి.. ఓ వ్యక్తి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త.. అన్నకు తెలియడంతో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఏకంగా తమ్ముడిపై హత్యాయత్నం చేసేంతలా దాడి జరిగింది. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని నాగర్ కోయిల్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే..నాగర్ కోయిల్ లో నివసించే సుందర్ ( పేరు మార్చాం)కి తన భార్య సుజాత ( పేరు మార్చాం) ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఇంటి సమీపంలోనే వరసకు తమ్ముడయ్యే సుధీర్ ( పేరు మార్చాం) వ్యక్తి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తరచూ తన సోదరుడి ఇంటికి సుధీర్ వస్తుండేవాడు. అయితే అప్పుడే తన అన్న భార్యపై కన్నేశాడు. ఆమెకు విలువైన కానుకలు, డబ్బులు ఇస్తూ తన బుట్టలో వేసుకున్నాడు. అలాగే ఆమెతో వావివరుసలు మరిచి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అన్న ఇంటినుంచి బయటకు వెళ్లడమే ఆలస్యం వదిన ఒడి వాలిపోయి, శృంగార సమరంలో తేలిపోయేవాడు. గుట్టుచప్పుడు కాకుండా వారు తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. కాగా.. చివరకు విషయం అతనికి తెలిసిపోయింది.
గూగుల్ యూజర్లకు బంఫర్ న్యూస్, చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి
తన భార్యతో తమ్ముడు సంబంధం పెట్టుకోవడాన్ని భరించలేకపోయాడు. ఆవేశంతో ఊగిపోయిన ఆయన.. పలు మార్లు తమ్ముడిని హెచ్చరించాడు. అయినా అతని తీరు మారకపోవడంతో ఎలాగైనా సోదరుడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గత వారం తమ్ముడిపై పదునైన కత్తితో గాయ పరిచాడు. అయితే స్థానికులు గమనించి నిందితుడు సుందర్ ను దాడి చేయకుండా అడ్డుకున్నారు.
గాయాలపాలైన సుధీర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.