Nidhi Tiwari Dies by Suicide: మిస్ ప్రిటీ ఇండియా 2024 టైటిల్ విజేత నిధి తివారీ ఆత్మహత్య.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మిస్ ప్రిటీ ఇండియా 2024 టైటిల్ విజేత నిధి తివారీ (30) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా, మోర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసా మోడ్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలోని ఒక గదిలో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.
Nidhi Tiwari Dies by Suicide: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మిస్ ప్రిటీ ఇండియా 2024 టైటిల్ విజేత నిధి తివారీ (30) అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా, మోర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసా మోడ్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలోని ఒక గదిలో ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 26 (శనివారం) రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందిన సోను సింగ్ అనే యువకుడితో నిధి తివారీ ఫోన్‌లో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. సంభాషణ అనంతరం ఆమె ఫేస్‌బుక్‌లో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ఈ అసంపూర్ణ హృదయాన్ని ఎవరూ నింపలేదు, నేనే దానిని పూర్తి చేసుకున్నాను. అందుకే నిన్ను నువ్వే ప్రేమించుకోవాలి.. నీలో నిన్ను వెతుక్కో, వేరొకరిలో కాదు అంటూ అందులో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడితో స్టూటెంట్ రాసలీలలు వీడియో వైరల్.. ఇది నిజం కాదని MMS స్కాండల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హచ్చరిక..
అనంతరం గది తలుపులు వేసుకుని భోజనానికి రాకుండా ఉండిపోయిన నిధి, ఆదివారం (సెప్టెంబర్ 27) ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
Nidhi Tiwari Dies by Suicide
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన నిధి తివారీ, కొంతకాలంగా తల్లి, చెల్లెలితో కలిసి సింగ్రౌలిలో నివసిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 9.28 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 7.12 లక్షల మంది ఫాలోవర్లతో డ్యాన్స్ రీల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఆమె, మోడలింగ్, సినీ రంగంలో రాణించాలని ఆశించారు. కాగా, ఘటన సమయంలో ఫోన్లో మాట్లాడిన యువకుడే కుటుంబానికి సమాచారం ఇచ్చారనే కథనాలపై పోలీసులు దృష్టి సారించారు. కాల్ డేటా రికార్డులు (CDR), సోషల్ మీడియా చాట్లను విశ్లేషిస్తూ మోర్వా పోలీసులు కేసును విచారిస్తున్నారు.