Mumbai Shocker: ముంబైలో దారుణం, బుర్ఖా ధరించలేదని భార్యను కిరాతకంగా పొడిచి చంపిన భర్త, నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 36 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌ ఇక్బాల్‌ షేక్‌ హిందు మహిళ రూపాలిని 2019లో పెళ్లి చేసుకున్నాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Mumbai, Sep 27: ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.బుర్ఖా ధరించలేదని భార్యను అతి కిరాతకంగా భర్త పొడిచి ( Man Allegedly Stabs Estranged Wife) చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 36 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌ ఇక్బాల్‌ షేక్‌ హిందు మహిళ రూపాలిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. రూపాలి అతన్ని పెళ్లి చేసుకోవడంతోనే తన పేరును జరాగా మార్చుకుంది. ఆ తర్వారత వారికి 2020లో ఒక కొడుడు జన్మించాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. రానురాను ఇక్బాల్‌ బురఖా ధరించాలంటూ (Not Wearing Burqa) ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.

అందుకు అంగీకరించని రూపాలి తన కుమారుడిని తీసుకుని విడిగా ఉంటోంది. ఐతే ఇక్బాల్‌ షేక్‌ విడాకులు తీసుకునే విషయమై చర్చించేందుకు కలుద్దాం అంటూ ఆమెని పిలిపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొడుకు కస్టడీ విషయమై వాగ్వాదం తలెత్తింది. అంతే ఒక్కసారిగా ఇక్బాల్‌ కోపంతో కత్తి తీసుకుని రూపాలిని పలుమార్లు పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2వేల జరిమానా విధించిన అదిలాబాద్ కోర్టు

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి విలాస్‌ రాథోడ్‌ తెలిపారు. నిందితుడు ఇక్బాల్‌ షేక్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif