Nishadh Yusuf Dies: అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించిన స్టార్ ఎడిటర్, నిషాద్ యూసుఫ్ మృతిపై సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nishadh Yusuf (Photo Credits: X)

తమిళ నటుడు సూర్య హీరోగా రూపొందిన ‘కంగువ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఉంటున్న 43 ఏళ్ల నిషాద్ తన నివాసంలో ఈ తెల్లవారుజామున విగతజీవిగా కనిపించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలో పాప్యులర్ ఎడిటర్‌గా పేరు సంపాదించుకున్న నిషాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2022లో విడుదలైన ‘తల్లుమాల’ సినిమాకు గాను నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న ‘బాజూకా’ సినిమాకు నిషాద్ పనిచేస్తున్నారు. కాగా, నిషాద్ ఎడిటర్‌గా పనిచేసిన కంగువ సినిమా వచ్చే నెల 14న విడుదల కానుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement