NCRB Report on Student Suicides: దేశాన్ని కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. 11 ఏళ్లలో 1.23 లక్షల మరణాలు.. ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులో షాకింగ్ విషయాలు..

NCRB Report on Student Suicides: జాతీయ నేరాల రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రచురించిన 'యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా' (ADSI) నివేదిక ప్రకారం.. 2014 నుండి 2024 వరకు పదకొండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

NCRB Report on Student Suicides (photo-File Image)

NCRB Report on Student Suicides: జాతీయ నేరాల రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రచురించిన 'యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా' (ADSI) నివేదిక ప్రకారం.. 2014 నుండి 2024 వరకు పదకొండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,23,918 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

2014లో 8,068గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 2024 నాటికి 14,488కి పెరిగి.. దాదాపు 80 శాతం పెరుగుదలను నమోదు చేసింది. విద్యార్థుల బలవన్మరణాలకు కుటుంబ సమస్యలు ప్రధాన కారణం కాగా, ఆ తర్వాతి స్థానంలో పరీక్షలలో వైఫల్యం నిలిచింది. కేవలం 2024 సంవత్సరంలోనే పరీక్షలలో విఫలమవడం వల్ల 2,032 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆ ఏటి మొత్తం విద్యార్థుల ఆత్మహత్యలలో 14 శాతానికి సమానం.

అమెరికాలో వేలాది మంది భారతీయ ఉద్యోగులపై ట్రంప్ మరో పిడుగు.. వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ రద్దు, పూర్తి వివరాలు ఇవిగో..

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. మహారాష్ట్రలో అత్యధికంగా సుమారు 17 వేల కేసులు, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 10 వేల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలే దేశవ్యాప్త విద్యార్థుల ఆత్మహత్యల్లో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. కోటా వంటి కోచింగ్ క్లస్టర్‌లతో పాటు ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి మెట్రో నగరాల విద్యా కేంద్రాల్లో ఈ ఆత్మహత్యల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

మరొకవైపు నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల గందరగోళం వంటి వ్యవస్థాగత లోపాలపై బొద్దింక జనతా పార్టీ పిలుపు మేరకు ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ఆరోగ్య శాఖ 2022లో 'జాతీయ ఆత్మహత్య నివారణ వ్యూహాన్ని' (NSPS) ప్రారంభించి.. 2030 నాటికి ఆత్మహత్య మరణాల రేటును 10 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అలాగే విద్యార్థులకు మానసిక మద్దతు ఇచ్చేందుకు 2020 జూలైలో ప్రారంభించిన 'మనోదర్పణ్ హెల్ప్‌లైన్'కు మార్చి 2026 నాటికి 3.32 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయని విద్యా మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. పదేపదే జరుగుతున్న పరీక్షల కుంభకోణాలు.. విద్యా వ్యవస్థలోని ఒత్తిడిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement