IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు రావాలని ప్రయత్నించిన ప్రయాణికుడు, ఒక్కసారిగా భయాందోళనలకు గురైన తోటి ప్రయాణికులు

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ (Delhi) నుంచి చెన్నై (Chennai)కు బయలుదేరిన విమానంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

IndiGo (Photo Credit: Wikimedia Commons)

New Delhi, Sep 20: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం ( IndiGo flight)లో ఓ ప్రయాణికుడు తోటివారిని హడలెత్తించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీ (Delhi) నుంచి చెన్నై (Chennai)కు బయలుదేరిన విమానంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఇండిగో 6ఈ6341 విమానం గత రాత్రి పొద్దుపోయాక ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరింది.

విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు, తోటి ప్రయాణికులపై దాడి, రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపిన ఎయిర్ ఇండియా అధికారులు

మరికొద్దిసేపట్లో ల్యాండ్‌ అవుతుందనగా ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. విమానం డోర్ తెరిచే ప్రయత్నం చేసిన వ్యక్తిని మణికందన్‌గా గుర్తించారు. విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే అతడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్‌ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.ఇండిగో అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement