Punjab Shocker: అన్నే కామాంధుడై..అయిదు ఏళ్లుగా చెల్లెలిపై అదే పనిగా అత్యాచారం, బయటకు చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరింపులు, గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక, పంజాబ్ పాటియాలలో అమానుష ఘటన

కూతురుపై తండ్రే అత్యాచారం చేసిన ఘటనలు వెలుగులోకి రాగా తాజాగా అన్నే చెల్లి పాలిట కామాంధుడై ఆమెపై పదే పదే అత్యాచారం (Repeatedly raped by cousin) చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చి బిడ్డకు (15-year-old girl delivers child in Patiala) జన్మనిచ్చింది. ఈ అమానుష ఘటన పంజాబ్‌లోని పాటియాలలో చోటు చేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Patiala, July 5: దేశంలో కామాంధులు వావి వరసలు మరచిపోతున్నారు. కూతురుపై తండ్రే అత్యాచారం చేసిన ఘటనలు వెలుగులోకి రాగా తాజాగా అన్నే చెల్లి పాలిట కామాంధుడై ఆమెపై పదే పదే అత్యాచారం (Repeatedly raped by cousin) చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చి బిడ్డకు (15-year-old girl delivers child in Patiala) జన్మనిచ్చింది. ఈ అమానుష ఘటన పంజాబ్‌లోని పాటియాలలో చోటు చేసుకుంది.

దారుణ ఘటన వివరాల్లోకెళితే.. పంజాబ్‌లోని పాటియాలలో ఓ 15 ఏళ్ల బాలిక తన కజిన్ ఇంట్లో ఉంటుంది. ఆమె ఆమె తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు, దాదాపు ఐదేళ్లుగా ఆ బాలిక అత్యాచారానికి గురైంది. అత్యాచారం చేసినప్పుడల్లా నేరాన్ని ఎవరికీ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించేవాడు

ఖైదీలతో బలవంతంగా సెక్స్, నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని బెదిరింపులు, శృంగారం చేసే సమయంలో మిగతా వారు కన్పార్పకుండా చూడాలని కండిషన్, కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైలు అధికారిణి అకృత్యాలు, చివరకు అదే జైలుకు ఖైదీగా..

దీంతో పాటు ఈ విషయం గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. భయపడి ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.