TTD: తిరుమల వడ్డీ కాసుల వాడికి రూ. 4.31 కోట్ల ఫైన్ విధించిన ఆర్బీఐ, విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వకుండా FCRA violationకు టీటీడీ పాల్పడిందని తెలిపిన RBI
తిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్ వేసింది
తిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్ వేసింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ-హుండీ ద్వారా పంపిన విరాళాల వివరాలు ఇవ్వలేదని.. ఇది...Foreign Contribution Regulation Act నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తుందని ఆర్బీఐ తెలిపింది. విచిత్రమేమిటంటే.. వీరి వివరాలు టీటీడీకి కూడా తెలియవు
ఆదాయపన్ను రిటర్నుల్లో ఈ మొత్తాన్ని నమోదు చేసినా, వివరాలు ఇవ్వలేదని ఆర్బీఐ 2019కిగానూ రూ.1.14 కోట్లు, ఈ ఏడాది మార్చి 5న రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. ఏపీసీహెచ్‌ఆర్ చట్టంలోని సెక్షన్ 111 పేరొన్నట్టు హుండీలో వేసిన కానుకలు టీటీడీ కార్పస్‌లో భాగమేనని టీటీడీ తన వాదనలను వినిపించింది. అయినా ఆర్బీఐ వినిపించుకోలేదు. దీంతో ఆ జరిమానాను టీటీడీ చెల్లించాల్సి వచ్చింది.
ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీటీడీకి యూఎస్ డాలర్లు రూ.11.50 కోట్లు, మలేషియా రింగిట్స్ రూ.5.93 కోట్లు, సింగపూర్ డాలర్లు రూ.4.06 కోట్లు అందాయి. ఈ మొత్తాన్ని టీటీడీ ఖాతాలో స్టేట్ బ్యాంక్ జమ చేయాలి. కానీ, మూడేండ్లు గడుస్తున్నా కదలిక లేదు. ఇదీ పరిస్థితి అని కేంద్రానికి విన్నవించినా, పట్టనట్టు వ్యవహరిస్తున్నదని జయరాం రమేష్ ట్వీట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Mar 28, 2023 02:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

