Tamil Nadu Shocker: వివాహేతర సంబంధం, యువతి డబ్బులు డిమాండ్ చేయడంతో న్యూడ్ వీడియోలు ఆమె భర్తకు పంపిన ప్రియుడు, తమిళనాడులో ఘటన
మహిళతో సన్నిహితంగా ఉంటూ ఆమె అశ్లీల వీడియోలను మాజీ భర్తకు పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చెన్నై కొళత్తూరు ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి (28) భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అన్నాసాలైలోని ఓ బ్రౌజింగ్ సెంటర్‌లో పని చేస్తోంది.
Chennai, July 7: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళతో సన్నిహితంగా ఉంటూ ఆమె అశ్లీల వీడియోలను మాజీ భర్తకు పంపిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చెన్నై కొళత్తూరు ఎంజీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన యువతి (28) భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అన్నాసాలైలోని ఓ బ్రౌజింగ్ సెంటర్‌లో పని చేస్తోంది. దుకాణం యజమాని అరుణాచలం (28) ఆమెతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతని దగ్గర నగదు తీసుకుంది. కొద్ది రోజులకు సదరు మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. దీంతో తనను మోసం చేసిందని గుర్తించిన అరుణాచలం.. ఆమెతో చనువుగా ఉన్న వీడియోలను భర్తకు పంపాడు. దీనిపై మహిళ విల్లివాక్కం మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ అనురాధ కేసు నమోదు చేసి మంగళవారం అరుణాచలంను అరెస్టు చేశారు.
ఇక కర్ణాటకలోని మైసూరులో పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు అబార్షన్ చేయించాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో ఆమెను తిరస్కరించాడు. మూడేళ్ల క్రితం విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువకునికి పరిచయమై ప్రేమ ఏర్పడింది. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది.
ప్రియుడు అబార్షన్ చేయించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి విజయనగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గణేశ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక నెల జైలు వాసం తర్వాత బెయిల్‌పై వచ్చిన నిందితుడు యువతికి మళ్లీ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. యువతి తిరిగి గర్భం దాల్చగా ఈసారైనా పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో అతడు కోపంతో ఆమె కడుపు మీద తన్నడంతో గర్భస్రావం కూడా జరిగింది. గణేశ్‌తో తనకు పెళ్లి చేయకపోతే బతకనని యువతి చెబుతోంది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.