Allahabad High Court: భర్త నిరుద్యోగి అయినా భార్యకు భరణం చెల్లించాలల్సిందే, కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్‌ హైకోర్టు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

భార్యకు పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యతను భర్త నిరుద్యోగం అనే కారణంతో తప్పించుకోలేడని అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. శారీరకంగా పనిచేయగలిగే స్థితిలో ఉన్న భర్తకు ఆదాయం లేకపోవడం సరైన నెపంగా పరిగణించబడదని కోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.

Allahabad High Court (PC - Wikimedia commons)

ఈ కేసులో కుటుంబ కోర్టు భార్యకు నెలకు రూ.2,500 తాత్కాలిక భరణం చెల్లించాలని ఆదేశించిన తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో పిటిషన్ నమోదు చేశారు. అయితే, కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

భార్య, చిన్న పిల్లల సంరక్షణకు అవసరమైన ఆర్థిక సాయం చేయడం భర్తకు తప్పనిసరి బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. శారీరక సామర్థ్యం ఉన్న భర్త పని చేసి అయినా ఆదాయం సంపాదించి ఈ బాధ్యతను నిర్వర్తించవలసి ఉంటుందని తీర్పులో హైలైట్ చేసింది. చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్న ప్రత్యేక పరిస్థితులు మినహా, భరణం చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం లేదని కోర్టు వివరించింది. ఇలాంటి భరణం కేసులు భర్తను శిక్షించడం కోసం కాకుండా, ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లే భార్యను రక్షించడానికి ఉద్దేశించబడ్డవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement