Auto Driver Invites Kejriwal to Dinner: నీ ఆటోలో మీ ఇంటికి భోజనానికి తీసుకువెళతావా, గుజరాత్ ఆటోవాలాకు ప్రశ్న వేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఆసక్తికర అనుభవం ఎదురయింది. ఓ ఆటో డ్రైవర్ తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అడగడంతో ఢిల్లీ సీఎం నీ ఆటోలోనే మీ ఇంటికి వెళదామని మరో ఇద్దరినీ వెంటబెట్టుకుని వస్తానని ఆఫర్ ఇచ్చారు.

Auto driver in Gujarat invites Arvind Kejriwal for dinner

గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఆసక్తికర అనుభవం ఎదురయింది. ఓ ఆటో డ్రైవర్ తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అడగడంతో ఢిల్లీ సీఎం నీ ఆటోలోనే మీ ఇంటికి వెళదామని మరో ఇద్దరినీ వెంటబెట్టుకుని వస్తానని ఆఫర్ ఇచ్చారు.

జ్ఞానవాపి కేసుపై కోర్టులో ముగిసిన విచారణ, అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు, ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ

దీనికి సంబంధించి ఆప్ వీడియో విడుదల చేయగా.. వైరల్ గా మారింది. కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశంలో విక్రమ్ దత్తా అనే ఓ ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. తాను కేజ్రీవాల్ కు వీరాభిమానిని అని చెప్పారు. పంజాబ్‌ లో ఓ ఆటో డ్రైవర్ ఇంట్లో మీరు భోజనం చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో చూశానని.. అలా తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అడిగారు.

Here's Video

విక్రమ్ దత్తా విజ్ఞప్తిపై స్పందించిన కేజ్రీవాల్.. ‘‘తప్పకుండా వస్తా. నాతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా మీ ఇంటికి భోజనానికి వస్తారు. రాత్రి 8 గంటలకు నీ ఆటోలోనే మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి తీసుకెళ్తావా?’’ అని అడిగారు. కేజ్రీవాల్ ఆఫర్ పై ఉబ్బితబ్బిబ్బయిన విక్రమ్ దత్తా.. తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement