WB Shocker: కన్నకొడుకే కాల యముడు, తండ్రిని ఆరు ముక్కలుగా నరికేసిన కసాయి, ముక్కలైన శరీర భాగాలను వివిధ ప్రదేశాల్లో పడేసిన కిరాతకుడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన

ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.భారత నావికాదళానికి చెందిన రిటైర్డ్ నాన్-కమిషన్డ్ ఆఫీసర్‌ని కన్న కొడుకే ముక్కలుగా (Ex Navy Officer Killed By Son) నరికేసాడు

Murder (Photo Credits: Pixabay)

Kolkata, Nov 21: ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.భారత నావికాదళానికి చెందిన రిటైర్డ్ నాన్-కమిషన్డ్ ఆఫీసర్‌ని కన్న కొడుకే ముక్కలుగా (Ex Navy Officer Killed By Son) నరికేసాడు.ఛిద్రమైన శరీర భాగాలను తమ ఇంటికి సమీపంలోని పలు ప్రాంతాల్లో పడేయడానికి సైకిల్‌పై కొడుకు పలుమార్లు వెళ్లాడు, మృతదేహాన్ని నరికి పారవేసినట్లు బాధితుడి భార్య, కుమారుడు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

2000లో నేవీ నుంచి పదవీ విరమణ పొందిన 55 ఏళ్ల ఉజ్వల్ చక్రవర్తిని కోల్‌కతా సమీపంలోని బరుయ్‌పూర్‌లో అతని కొడుకు హత్య చేసి, మృతదేహాన్ని కనీసం ఆరు ముక్కలుగా చేసి, అనేక ప్రదేశాల్లో పారవేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లీ కొడుకులిద్దరినీ అరెస్టు చేశారు.పరీక్షకు ఫీజు చెల్లించే విషయంలో బాధితుడు తన కుటుంబ సభ్యులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడని, దీంతో కొడుకు తన తండ్రిని గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు.

శ్రద్దా వాకర్‌ హత్య కేసు మరచిపోకముందే మరో దారుణం, ప్రియురాలి శరీరాన్ని ఆరు ముక్కలుగా కోసి బావిలో పడేసిన ప్రియుడు, తనను కాదని మరో పెళ్లి చేసకుందనే కోపమే కారణం

ఛిద్రమైన బాధితుడి మృతదేహాన్ని చెరువు (Body Parts Found In Bengal Pond) నుంచి వెలికితీశారు. చెరువు సమీపంలోని చెత్త డంప్ నుండి ఇతర కత్తిరించిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బరుయ్‌పూర్‌లోని చెరువులో ఒక వ్యక్తి యొక్క ఛిద్రమైన మృతదేహం ప్లాస్టిక్ ప్యాకేజీలో చుట్టబడి కనిపించింది. అతని కుటుంబ సభ్యులు నవంబర్ 15 న తప్పిపోయిన ఫిర్యాదును నమోదు చేసారు" అని పోలీసు సూపరింటెండెంట్ పుష్ప తెలిపారు.

మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే విచారణలో బాధితుడు తరచు తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తల్లి కొడుకులిద్దర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ పుష్ప తెలిపారు.