Asaduddin Owaisi on POK: పీవోకేపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు, అది భారత్‌లో అంతర్భాగమే కాని బీజేపీ ఎన్నికల సమయంలోనే..

పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేత‌లు పీవోకే గురించి ప‌దేప‌దే మాట్లాడుతున్నారని... ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు.

Asaduddin Owaisi and Modi (photo-ANI)

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఇప్పటి వరకు ఐదు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత బీజేపీపై విమర్శనాస్రాలతో విరుచుకుపడ్డారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేత‌లు పీవోకే గురించి ప‌దేప‌దే మాట్లాడుతున్నారని... ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు.  దేవుడే నన్ను ఇక్కడకు పంపించాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, జీవశాస్త్రపరంగా నేను పుట్టలేదని చెప్పిన వీడియో వైరల్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 400 స్ధానాలకు పైగా గెలుస్తామని ప్రారంభంలో చెప్పినట్లుగా ఇప్పుడు బీజేపీ చెప్పడం లేదన్నారు. పెట్రోల్ ధ‌ర‌లు రూ.100 దాటాయ‌ని మండిపడ్డారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌రిలో ఉన్న వార‌ణాసిలో పేప‌ర్ లీక్‌ల ఘ‌ట‌న‌ల వంటి వాస్త‌వ అంశాల‌ను బీజేపీ మ‌రుగున‌ప‌డేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement