India's COVID19 Tally: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,522 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 97.67 లక్షలు దాటిన కొవిడ్ కేసుల సంఖ్య, 3,72,293గా ఉన్న ఆక్టివ్ కేసులు

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.74% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 3.81% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....

COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, December 10: భారతదేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు మనదేశంలో మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 31,522 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 97,67,372కు చేరింది. నిన్న ఒక్కరోజే 412 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,41,772కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,725 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 92,53,306 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 3,72,293 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.74% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 3.81%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక డిసెంబర్ 9 వరకు దేశవ్యాప్తంగా 15,07,59,726 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9,22,959 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. అయితే ఆ రాష్ట్రంలోనూ ఆక్టివ్ కేసులు తగ్గుతుండటం ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆక్టివ్ కేసులు 74, 315కు చేరగా, కొవిడ్ మరణాలు 47,902కు పెరిగాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement