Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా,ఇతర మంత్రులు
హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు (Holi greetings) తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు
హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు (Holi greetings) తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం సూచించారు.రాష్ట్ర ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా సాగాలనే సందేశాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రకృతి మెచ్చే రంగులతో హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం సూచించారు.
రాష్ట్రపతి ట్వీట్
PM Modi Tweet
CMO TS Tweet
CM YS Jagan Tweet