Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది.. ఎవరికి జాగ్రత్త అవసరమంటే..
Horoscope Today: జ్యోతిషం, రాశి ఫలాలను విశ్వసించే వారు తమ రోజువారీ పనులను ప్రారంభించే ముందు దిన ఫలాలను చూసుకోవడం ఆనవాయితీ. దానికి అనుగుణంగానే తమ ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Horoscope Today: జ్యోతిషం, రాశి ఫలాలను విశ్వసించే వారు తమ రోజువారీ పనులను ప్రారంభించే ముందు దిన ఫలాలను చూసుకోవడం ఆనవాయితీ. దానికి అనుగుణంగానే తమ ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేషం: చేసే ప్రయత్నకార్యాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలదు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఎంతో ఆనందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. శాశ్వత ప్రాతిపదికన చేపట్టే పనులకు శ్రీకారం చుడతారు.
వృషభం: ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నూతన వస్తువులు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.
సర్ప దేవతల ఆశీస్సుల కోసం మీ ప్రియమైన వారికి పంపాల్సిన శుభాకాంక్షలు, సందేశాలు!
మిథునం: ఊహించని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. అయితే ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు పెరుగుతాయి. స్త్రీల ద్వారా ధనలాభం పొందుతారు.
కర్కాటకం: ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడలు, రాజకీయ రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రేయస్కరం.
సింహం: స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందువినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు, భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.
కన్య: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణాలు తీరిపోతాయి. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుసుకుంటారు.
తుల: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అయితే ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉన్నందున ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యల వల్ల బలహీనపడతారు. అధికారుల భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు.
వృశ్చికం: ధైర్యసాహసాలు, సూక్ష్మబుద్ధితో విజయం సాధిస్తారు. మీ పరాక్రమానికి తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆకస్మిక లాభాలు ఉన్నాయి.
ధనుస్సు: కుటుంబంలో అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టం జరగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు.
మకరం: కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆర్థిక ఇబ్బందులు સ્વల్పంగా ఉంటాయి.
కుంభం: కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. ఇతరులకు ఉపకారం చేసే పనుల్లో నిమగ్నమవుతారు. స్త్రీల మూలకంగా లాభం కలదు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది, రుణబాధలు తొలగుతాయి.
మీనం: తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తి పెరుగుతుంది. స్త్రీలు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం.