Horoscope Today, August 10, 2026: ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి..

కొత్త రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా రాశిఫలాలు సూచిస్తాయి. మరి ఈ రోజు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయి?

Horoscope

Horoscope Today, August 10, 2026: కొత్త రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం వంటి అంశాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా రాశిఫలాలు సూచిస్తాయి. మరి ఈ రోజు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురుకానున్నాయి? ఏ రాశివారికి అనుకూల సమయం ఉండనుంది? ఎవరు అప్రమ త్తంగా వ్యవహరించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం

భోజన సమయాల్లో క్రమశిక్షణ పాటించడం అవసరం. పిల్లల విషయంలో అతిగా కఠినంగా వ్యవహరించకుండా ప్రేమతో మాట్లాడటం మంచిది. భావోద్వేగాలు పెరిగే పరిస్థితులు ఎదురుకావచ్చు కాబట్టి ఆవేశానికి దూరంగా ఉండాలి. ముఖ్యమైన కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి ఈరోజు అనుకూల సమయం కాకపోవచ్చు.

వృషభం

ఇతరులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ, వృత్తి రంగాల్లో ఎదురయ్యే సమస్యలను మీ సమర్థతతో పరిష్కరించగలుగుతారు. ఏ పని చేపట్టినా ముందస్తు ఆలోచన అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులను అంచనా వేయడం మంచిది. కీలక సమయంలో మీ ధైర్యం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మిథునం

మీ ముందుకు కొన్ని మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన సమాచారం లేదా శుభవార్త వినే అవకాశం ఉంది. సన్నిహితుల సహకారం మీకు బలాన్నిస్తుంది. అనుకోని మార్గంలో ఆర్థిక ప్రయోజనం కలగవచ్చు. కొత్త వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కర్కాటకం

ఆకస్మికంగా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. చాలాకాలంగా కలవని సన్నిహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మహిళల సహకారం లేదా వారి ద్వారా ప్రయోజనం చేకూరవచ్చు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

సింహం

శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనం పొందే సూచనలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ, గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది.

కన్య

ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. కొత్త కార్యక్రమాల్లో కొన్ని అడ్డంకులు కనిపించవచ్చు. చిన్న విషయాలకే ఆగ్రహం వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలి. మాటల్లో తొందరపాటు ఇతరులతో అపార్థాలకు దారితీయవచ్చు. ఇతరులకు నష్టం కలిగించే ఆలోచనలు, చర్యలకు పూర్తిగా దూరంగా ఉండటం మీకు మేలు చేస్తుంది.

తుల

విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేసే వారికి అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న విషయాలపై వివాదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాల్లో అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

వృశ్చికం

కొత్త కార్యక్రమాలను ప్రారంభించడంలో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. భోజన విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని విషయాలు మనసును కలవరపెట్టే అవకాశం ఉంది. నిజాయితీగా వ్యవహరించడం ద్వారా సమస్యలను దూరం చేసుకోవచ్చు. చిన్న విషయాలను పెద్దవిగా భావించి అనవసరంగా ఆందోళన చెందకండి.

ధనుస్సు

పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు ఆందోళన కలిగించవచ్చు. అయితే అధికారుల నుంచి గౌరవం, సహకారం లభించే అవకాశం ఉంది. మీరు నిర్ణయించుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. గతంలో ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరం

విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత ప్రయత్నాలకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం లేదా ఇతర కారణాలతో స్థాన మార్పు సంభవించే అవకాశం ఉంది. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం లేదా రుణం లభించవచ్చు. అలర్జీ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పనులు అనుకున్న దానికంటే ఆలస్యంగా పూర్తవుతాయి.

కుంభం

సన్నిహితులు, బంధువులతో చిన్న విషయాలు వివాదాలకు దారితీయకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి పెరిగే పరిస్థితులు రావచ్చు. అయితే ఆరోగ్యపరమైన సమస్యలను క్రమంగా అధిగమిస్తారు. ఇతరులు చేసే ఆరోపణలు లేదా అపార్థాల కారణంగా ఇబ్బందులు రావచ్చు. నిర్ణయం తీసుకునే విషయంలో సందిగ్ధతకు లోనుకాకుండా స్పష్టతతో ముందుకు సాగాలి. కొత్త ప్రాజెక్టులు, పనులకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తారు.

మీనం

మీరు లక్ష్యంగా పెట్టుకున్న పనులు ఒక్కొక్కటిగా విజయవంతమయ్యే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితుల నుంచి గౌరవం, ఆదరణ లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో సహచరులకు మీ వంతు సహాయం అందించే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలను పద్ధతి ప్రకారం అమలు చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. రోజంతా అనుకూల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement