Garlic Benefits: వెల్లుల్లి తినండి శృంగారంలో రెచ్చిపోండి, నపుంసకత్వాన్ని మీ దగ్గరకు రాకుండా చేసే వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

వెల్లుల్లి మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలుసా.. అవును ఇది నిజం. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట..

Garlic (Photo Credits: Public Domains Pictures)

Garlic Increase Your Sex Drive: వెల్లుల్లి మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలుసా.. అవును ఇది నిజం. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉంది. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బరు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అంతేకాదు, గర్భం ధరించేందుకు ప్రయత్నించినప్పుడు మహిళలకు అవసరమైన శక్తిని వెల్లుల్లి ఇస్తుంది. అలాగే వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

కరోనాతో గుండెపోటుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి, కోవిడ్‌కి హార్ట్ ఎటాక్‌కి సంబంధంపై రెండు నెలల్లో నివేదిక వస్తుందని వెల్లడి

స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారుచేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. చాలామంది పురుషులలో, రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) ఉత్పత్తి పెరగడం సంతానలేమికి ప్రధాన కారణం. శరీరం సహజ యాంటీఆక్సిడెంట్లు లేనప్పుడు ఆక్సీకరణస్థాయి పెరిగి ఒత్తిడిని సృష్టిస్తుంది. వెల్లుల్లి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే సెల్యులార్ నష్టాన్ని తగ్గించి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

పెద్దలకు బూస్టర్‌ డోస్‌గా త్వరలో Covovax, దీని ఖరీదు రూ.225తో పాటు అదనంగా జీఎస్టీ, వెల్లడించిన అధికార వర్గాలు

ఇక వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలను అందిస్తుంది.వెల్లుల్లిలోని అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది. వెల్లుల్లిలోని సెలీనియం సహజ యాంటీఆక్సిడెంట్ లా పనిచేసి శుక్రకణాల చలనశీలతను పెంచుతుంది. సీ, బీ-6 – ఈ విటమిన్లు వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.

ఇక స్త్రీల విషయానికి వస్తే.. వెల్లుల్లి అండోత్సర్గమును ఉత్తేజపరచడమేకాక క్రోమోజోమ్ లోపాలను నివారిస్తుంది. కాబట్టి ఆడవారిలో సంతానోత్పత్తికి బాగా సాయపడుతుంది.క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకునే స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.వెల్లుల్లిలోని విటమిన్ బీ- 6 పుష్కలంగా ఉంటుంది, ఇది అండోత్సర్గములో సహాయపడుతుంది.వెల్లుల్లి ఇది ఆహారంలో చేర్చుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తుంది. అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది.ఇది చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement