Health Benefits Of Kiss: లిప్ కిస్ వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు, సైంటిస్టులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

ముద్దుల వలన మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుందట. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు చెపుతున్నారు.

Representational Image (Photo Credits: Pixabay)

ఒక్క ముద్దు వెయ్యి ఓల్టేజీల శక్తిని ఇస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఈ ముద్దు వల్ల చాలా లాభాలు కూడా ఉన్నట్టు పరిశోధకులు చెపుతున్నారు. ముద్దు వల్ల ఆనందం తద్వారా ఆరోగ్యం ఉత్తేజం తదితర పరిణామాలు ఉంటాయని అంటున్నారు. ముద్దుల వలన మనుషుల్లో మార్పులు, ఉత్తేజం కలగడం, మస్తిష్కంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుందట. దీంతో సెక్స్ కోరికలు విచ్చుకుంటాయని పరిశోధకులు చెపుతున్నారు. చుంబనాల వలన మీలోని హార్మోన్లు మీ పార్టనర్ శరీరంలోకి ప్రవేశించి ఇద్దరిలోనూ ఆ ప్రభావం ఉంటుందంటున్నది పరిశోధకుల వాదనగా ఉంది. ఇది కేవలం రెండు పెదవుల స్పర్శ వలన మస్తిష్కంలో తీవ్రమైన అలజడి రేగి ఎమోషనల్‌గా మార్చివేస్తుందని వారు వాదిస్తున్నారు.

ఈ ముద్దు అంశంపై 15 జంటలను ప్రత్యేకంగా ఎంపిక చేసి ముద్దులకు ముందు.. ముద్దుల తర్వాత వారిలో ఉత్పత్తి చెందే ఆక్సీటానిక్, కోర్టీసోల్ హార్మోన్ల శాతాన్ని లెక్కవేశారు. ముద్దుల తర్వాత ఆక్సీటానిక్ హార్మోన్లు వారిరువురిని దగ్గరకు చేరదీయడమే కాకుండా, కోర్టీసోల్ హార్మోన్ శరీరంలో వేడిని పుట్టించి కామోద్దీపనాన్ని మేల్కొల్పుతుందని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. అందుకే.. ముద్దంటే చేదు కాదని మన పెద్దలు అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement