Health Tips: నిద్రలేమి సమస్యా అయితే మీకు క్యాన్సర్ ముప్పు,అంతేగాదు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ!

అయితే కొన్ని వంశపార పర్యంగా వచ్చే వ్యాధులైతే మరికొన్ని మాత్రం ఏరికోరి తెచ్చుకునేవి. ఇందులో ప్రధానంగా నిద్రలేమి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఇది రుగ్మతగా మారింది. పగటి నిద్రపోవడం,మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది నిద్రలేమి సమస్య.

Health Tips lack of sleep lead to cancer ..here is the full details

Aug 1: కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వివిధ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే కొన్ని వంశపార పర్యంగా వచ్చే వ్యాధులైతే మరికొన్ని మాత్రం ఏరికోరి తెచ్చుకునేవి. ఇందులో ప్రధానంగా నిద్రలేమి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఇది రుగ్మతగా మారింది. పగటి నిద్రపోవడం,మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది నిద్రలేమి సమస్య.

ఇక తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. నిద్రలేమి సమస్యతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని నిపుణులు వెల్లడించారు. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగా లేకుంటే ఆ రోజు అంతా చికాకు, గొడవలే. నిద్ర సరిగా లేకుంటే పెద్దప్రేగులో పాలిప్స్ పెరుగుతున్నట్లు వైద్యుల పరిశోధనలో తేలింది.క్రమక్రమేణా ఇది క్యాన్సర్‌గా మారుతుందని గుర్తించారు.

అలాగే డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా మహిళల్లో నిద్ర లేమి సమస్య కారణంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. సరిగ్గా నిద్రపోని మహిళలకు ఈ తరహా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక పురుషులకు నిద్రలేమి సమస్య కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.  కేవలం 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి, బరువు తగ్గడం పక్కా, షాకింగ్ రిజల్ట్స్

మెలటోనిన్ హర్మోన్ తగ్గడం వల్ల జరుగుతుంది.అలాగే నిద్రలేమితో శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరిగి, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయి. అలాగే నిద్రమేలి సమస్యతో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపి చివరికి క్యాన్సర్‌గా మారుతుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif