Relation Tips: నా యోనిలో అంగం చొప్పించి స్ఖలించిన తర్వాత.. వీర్యం బయటకు లీక్ అవుతోంది. ఏం చేయాలో చెప్పండి..

నా భర్త నా యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత, అది నెమ్మదిగా బయటకు కారిపోతోంది. దీంతో పిల్లలు పుట్టరేమో అనే సందేహం కలుగుతోంది. అంతేకాదు మూడు నెలలుగా ఇద్దరం తరచూ సెక్స్ లో పాల్గొంటున్నా పిల్లలు కలగడం లేదు.

file

ప్రశ్న: నా పేరు వసుంధర ( పేరు మార్చాం) నా వయస్సు 25 సంవత్సరాలు, పెళ్లి అయి 3 నెలలు అయ్యింది. మా అత్తగారు వారు మమ్మల్ని వెంటనే పిల్లలను కనమని ఫోర్స్  చేస్తున్నారు. దీంతో నేను నా భర్త తరచూ శృంగారంలో కలుస్తూ పిల్లలను కనాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరం సెక్స్ చేస్తున్నాం. అయితే సెక్స్ అనంతరం నా భర్త నా యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత, అది నెమ్మదిగా బయటకు కారిపోతోంది. దీంతో పిల్లలు పుట్టరేమో అనే సందేహం కలుగుతోంది. అంతేకాదు మూడు నెలలుగా ఇద్దరం తరచూ సెక్స్ లో పాల్గొంటున్నా పిల్లలు కలగడం లేదు. కారణం యోనిలో వీర్యం బయటకు కారిపోవడమేనా..లేక మరేదైనా కారణం ఉందా.

Relation Tips: సెక్స్ చేసే సమయంలో నా బాయ్ ఫ్రెండ్ డబుల్ కండోమ్ వాడుతా ...

సమాధానం:  యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత అందులో కొద్ది మొత్తం బయటకు కారడం సహజమే. అలా బయటకు రావడం ప్రతీ ఒక్కరిలోనూ సంభవిస్తుంది. యోని వీర్యంతో నిండిపోయిన తర్వాత బయటకు కారుతుంది. ఇందులో సందేహ పడాల్సిన అవసరం లేదు. ఇక యోనిలో అంగం వీర్యం స్ఖలించిన తర్వాత అందులోని శుక్రకణాలు మీలోని అండంలోకి చొచ్చుకుపోవాలి. అప్పుడే మీరు గర్భం దాల్చుతారు. మీ పెళ్లి జరిగి ఇంకా మూడు నెలలు మాత్రమే అవుతోంది. కావునా ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొన్ని రోజుల పాటు ఇలాగే ప్రయత్నించండి. తప్పకుండా మీరు గర్భవతి అవుతారు. మీ పీరియడ్స్ సమయానికి వస్తున్నాయో లేదో ఓ సారి గమనించండి. ఆ తర్వాత మీరు తల్లి అయ్యే అవకాశాలు పెరిగే చాన్స్ మరింత ఎక్కువగా ఉంటుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement