Sex After a Heavy Meal: పుష్టిగా భోజనం చేసిన వెంటనే సెక్స్ చేస్తే ఏమవుతుంది, సైంటిస్టులు ఏం చెబుతున్నారు, ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన రహస్యాలు..
అలా చేయడం వల్ల నష్టమే.. లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. అది అసిడిటీకి దారి తీయవచ్చు.
Sex After a Heavy Meal: సెక్స్ ఏ సమయంలో చేస్తే మంచిది? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు సెక్స్ చేయొచ్చా? లేదా కడుపునిండా తిన్న తర్వాత చేయాలా? ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడుతుంటాయి. మన దేశంలో ఎక్కువ మంది పగలు కంటే రాత్రి వేళల్లోనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
> భోజనం చేసిన వెంటనే చేయకపోవడమే ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
>> చాలా మంది భోజనం తర్వాతే సెక్స్ చేయడానికి ఇష్టపడతారు. అలా చేయడం వల్ల నష్టమే.. లాభం ఉండదని హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే సెక్స్ చేయడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుంది. అది అసిడిటీకి దారి తీయవచ్చు.
>> భోజనానికి.. సెక్స్‌కు మధ్యం కనీసం రెండు గంటల గ్యాప్ ఉంటే మంచిది. నిపుణుల సూచనల ప్రకారం..అర్థరాత్రి వేళల్లో సెక్స్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
>> తెల్లవారుజాము 5 గంటల నుంచి 8 గంటల లోపు చేసే సెక్స్ భలే రసవత్తరంగా సాగుతుంది. తెల్లవారుజామున పురుషాంగం సైతం సెక్స్‌కు బాగా సహకరిస్తుంది. ఆ సమయంలో ప్రేరణ లేకుండానే పురుషాంగం గట్టిపడి పార్టనర్‌కు స్వర్గం చూపిస్తుందట.
>> మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా సెక్స్ చేయకూడదు. భోజనం పూర్తి చేసిన 2 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య సెక్స్ స్త్రీ, పురుషులిద్దరికీ మంచిదేనట. ఆ సమయంలో పురుషుల నుంచి విడులయ్యే వీర్యం నాణ్యతగా ఉంటుందట.
>> హర్వార్డ్‌కు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వలేరీ అంటోయ్నీ గుస్టావే చెప్పిన వివరాల ప్రకారం.. తిన్న వెంటనే సెక్స్ లేదా వ్యాయామాలు చేస్తే వికారం ఏర్పడుతుంది. ఆ జీర్ణసంబంధిత సమస్యలతోపాటు ఇతరాత్ర ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకొనే ప్రమాదం ఉంది.