‘Rent a Garba Partner’ Controversy: నవరాత్రి వేళ గుజరాత్‌లో 'రెంట్ ఏ గర్బా పార్ట్‌నర్' ప్రకటనల కలకలం.. ఆన్‌లైన్ మోసాలపై సైబర్ క్రైమ్ హెచ్చరిక!

రాబోయే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గుజరాత్‌లో "గర్బా భాగస్వామిని అద్దెకు తీసుకోండి" (Rent A Garba Partner) అంటూ నిర్ణీత రుసుముతో సేవలందిస్తామనే సోషల్ మీడియా పోస్టులు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర డిజిటల్ వేదికలపై వైర్‌లగా మారిన ఈ ప్రకటనల పట్ల అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ తీవ్రంగా స్పందించింది.

Viral 'Rent A Garba Partner' Posts (Photo Credits: Instagram)

‘Rent a Garba Partner’ Controversy: రాబోయే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గుజరాత్‌లో "గర్బా భాగస్వామిని అద్దెకు తీసుకోండి" (Rent A Garba Partner) అంటూ నిర్ణీత రుసుముతో సేవలందిస్తామనే సోషల్ మీడియా పోస్టులు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర డిజిటల్ వేదికలపై వైర్‌లగా మారిన ఈ ప్రకటనల పట్ల అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ తీవ్రంగా స్పందించింది. ఇది ఆన్‌లైన్ మోసాలకు (Cyber Frauds) దారితీసే ప్రమాదముందని సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరించగా, మరోవైపు మతపరమైన పండుగను వ్యాపారమయం చేస్తూ సంస్కృతిని దిగజార్చేలా ఉన్నాయంటూ స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు సామాజిక బృందాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అహ్మదాబాద్, సూరత్, ముంబై పరిధిలోని పలు సోషల్ మీడియా ఖాతాలలో ప్రచారంలో ఉన్న ఈ ప్రకటనల్లో విభిన్నమైన ప్యాకేజీలను పొందుపరిచారు:

సిల్వర్ ప్యాకేజీ (INR 1,000): రెండు గంటల పాటు గర్బా సహవాసంతో పాటు జంటగా ఒకేలాంటి దుస్తులు (మ్యాచింగ్ డ్రెసెస్), ప్రాథమిక నృత్య పాఠాలు మరియు సెల్ఫీలు.

గోల్డ్ ప్యాకేజీ (INR 1,500): నాలుగు గంటల వ్యవధికి గాను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫోటోగ్రాఫ్‌లు మరియు ఆ జంట పరిచయంపై ఒక కల్పిత "నేపథ్య కథ" (Backstory).

ప్లాటినం ప్యాకేజీ (INR 2,000): ఒక పూర్తి రాత్రికి వర్తిస్తుంది. ఇందులో దుస్తుల ఎంపిక, బహిరంగ మర్యాదలు మరియు ఈవెంట్ ముగిసిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేర్చడం వంటి సేవలు ఉంటాయని పోస్టుల్లో దావా చేశారు.

మార్వాడీ వైరల్ వీడియోపేరిట సైబర్ మోసం.. పూర్తి వీడియో లింక్‌లు నకిలీవని హెచ్చరించిన నిపుణులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి క్లిక్ చేయవద్దని వెల్లడి..

కొన్ని ప్రొఫైళ్లలో గరిష్టంగా రూ. 10,000 వరకు అధిక ధరలు లేదా అదనపు యాడ్-ఆన్‌లను కూడా ప్రదర్శిస్తున్నారు.

పోలీసుల పర్యవేక్షణ – ఆన్‌లైన్ చెల్లింపులపై తీవ్ర హెచ్చరిక

అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ ఏసీపీ హార్దిక్ మండాకియా మాట్లాడుతూ, తమ బృందం గత ఐదారు రోజులుగా ఈ సోషల్ మీడియా పోస్టులను నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రారంభంలో తక్కువ సంఖ్యలో ఉన్న ఈ ఖాతాలు రీచ్ పెంచుకోవడానికి యూజర్ల ద్వారా షేర్ చేయబడి, తర్వాతి దశల్లో ఏఐ (AI-generated) సాంకేతికతతో తయారు చేసిన కంటెంట్‌తో అనేక ఖాతాలకు వ్యాపించినట్లు గుర్తించారు.

కేవలం సోషల్ మీడియా ప్రకటనలు చూసి అపరిచిత లేదా ధృవీకరించని ఖాతాలకు ముందస్తుగా డబ్బు బదిలీ చేయవద్దని సైబర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే ఆర్థికంగా మోసపోయే ప్రమాదముందని, ఇప్పటికే ఎవరైనా డబ్బులు చెల్లించి ఉంటే తక్షణమే సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. ఏదైనా ఆన్‌లైన్ లావాదేవీ చేసేముందు సదరు వ్యక్తులు లేదా సంస్థల అసలు గుర్తింపును ధృవీకరించుకోవాలని నెటిజన్లను కోరారు. సూరత్‌లోనూ పోలీసు ప్రత్యేక విభాగం ఈ పోస్టులను పరిశీలిస్తోందని, అనుమానాస్పదంగా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ప్రచార విన్యాసమా? నిజమైన అద్దె సేవలా?

ఈ ట్రెండ్ సెప్టెంబర్ మధ్యలో క్రిష్ మిస్త్రీ అనే యూజర్ "ఈ నవరాత్రి, ఒంటరిగా నృత్యం చేయకండి" అనే నినాదంతో పెట్టిన ఒక సరదా/వ్యంగ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ప్రారంభమైనట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ పోస్ట్ కేవలం వినోదం మరియు ఫాలోవర్ల ఆకర్షణ కోసం పెట్టిందే తప్ప నిజమైన సేవల కోసం కాదని నిర్వాహకుడు స్పష్టం చేసి, వివాదం ముదరడంతో దాన్ని తొలగించారు. మీడియా దర్యాప్తులో కూడా ఇతర పేజీ నిర్వాహకులు తమ రీచ్ పెంచుకోవడానికి మీమ్స్ లేదా జోకులుగా వీటిని డిజైన్ చేశామని, నిజానికి అద్దెకు ఇచ్చేందుకు ఎలాంటి భాగస్వాములు అందుబాటులో లేరని ఒప్పుకున్నారు.

హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం & విచారణకు డిమాండ్

ఈ పోస్టులపై స్థానిక సాంస్కృతిక, మతపరమైన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నవరాత్రి అనేది భక్తి, దుర్గామాత ఆరాధన మరియు సాంప్రదాయక గర్బా నృత్యానికి సంబంధించిన పండగ అని, భాగస్వాములను వెతుక్కునే ప్రదేశం కాదని సూరత్ భజరంగ్ దళ్ కార్యకర్త ప్రతాప్ రాజ్‌పురోహిత్ మండిపడ్డారు.

గుజరాత్ భజరంగ్ దళ్ ప్రాంతీయ సహ-కన్వీనర్ జ్వలిత్ మెహతా మాట్లాడుతూ, ఈ పోస్టుల వెనుక ఉన్న వారి అసలు ఉద్దేశాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ప్రజలు తమ కుటుంబాలు, స్నేహితులతో కలిసి ఎంతో పవిత్రంగా ఆడుకునే గర్బా పండుగలో అద్దె భాగస్వాములనే నీచమైన ధోరణికి తావులేదని స్పష్టం చేశారు.

అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్న నవరాత్రి వేడుకల కోసం గుజరాత్‌ వ్యాప్తంగా సొసైటీలు, పార్టీ ప్లాట్లలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పోస్టుల ద్వారా ఇప్పటివరకు ఎవరైనా బాధితులు డబ్బులు పోగొట్టుకున్నట్లు అధికారికంగా నమోదు కానప్పటికీ, పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని జరిగే సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు నిఘాను మరింత తీవ్రతరం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement