UP Shocker: తన తండ్రి కామకోరికలను తీర్చమని భార్యను కోరిన భర్త, వీల్లేదని వ్యతిరేకించినందుకు ఏం జరిగిందంటే..
సొంత కొడుకు భార్య పైనే మామగారు కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పి బాధితురాలు తన బాధను తెలిపింది. తండ్రికి బుద్ధి చెప్పాల్సిన తనయుడు, కాస్తా తన భార్యదే తప్పని, తన తండ్రి కోరిక తీర్చాలని ఆమెకు నచ్చచెప్పాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. సొంత కొడుకు భార్య పైనే మామగారు కన్నేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషయాన్ని భర్తకు చెప్పి బాధితురాలు తన బాధను తెలిపింది. తండ్రికి బుద్ధి చెప్పాల్సిన తనయుడు, కాస్తా తన భార్యదే తప్పని, తన తండ్రి కోరిక తీర్చాలని ఆమెకు నచ్చచెప్పాడు. అందుకు బాధిత మహిళ నిరాకరించడంతో ఆమెకు విడాకులు ఇస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో బాధిత మహిళ పోలీస్ స్టేషన్‌లో భర్తతో పాటు మామగారిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు అసలు విషయంపై విచారణ ప్రారంభించారు. దీంతో పాటు నిందితుడి ఇంట్లో సోదాలు చేశారు.
MP Shocker: కోడలు స్నానం చేస్తుంటే బాత్రూంలోకి దూరిన మామగారు ...
పోలీసుల కథనం ప్రకారం, అలీఘర్‌లోని మల్పూర్ ప్రాంతంలో ఆగ్రాకు చెందిన ఒక అమ్మాయి వివాహం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత,అత్తింట్లో ఆమెను హింసించడం ప్రారంభించారు. దీంతో పాటు మామగారు తనపై కన్నేశారు. దీన్ని బాధిత మహిళ వ్యతిరేకించడంతో భర్త, అత్తగారు ఆమెను శారీరకంగా హింసించారు. అదే సమయంలో బాధిత మహిళకుట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి కోరిక తీర్చమని భర్త అడిగాడని మహిళ ఆరోపించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.