Badlapur Sexual Assault Case: బద్లాపూర్‌లో దారుణం, స్కూల్లో టాయిలెట్‌కు వెళ్లిన పసిపాపలపై అటెండర్‌ లైంగికదాడి, ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద నొప్పిగా ఉందంటూ తల్లిదండ్రుల ముందు ఏడ్చిన పిల్లలు

మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి చేశారు. కిండర్‌ గార్టెన్‌లో చదువుతున్న మూడు, నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై అటెండర్‌ వేధింపులకు పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థినులతో అటెండర్ అసభ్యంగా ప్రవర్తించాడు.

Representational Image (File Photo)

Mumbai, August 21: మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్‌ లైంగిక దాడి చేశారు. కిండర్‌ గార్టెన్‌లో చదువుతున్న మూడు, నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై అటెండర్‌ వేధింపులకు పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థినులతో అటెండర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు మరుసటి రోజు స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో పాటు ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.  టీచర్ కాదు కామాంధుడు, అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అది పట్టుకుని అలా చేయాలంటూ లైంగిక వేధింపులు, అరెస్ట్

దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకున్నది. విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ప్రిన్సిపాల్‌తో పాటు క్లాస్ టీచర్‌, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై పాఠశాల క్షమాపణలు కూడా చెప్పింది. బాలికలపై లైంగిక వేధింపుల మహారాష్ట్రలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను సైతం అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ట్రాక్‌ ఆందోళనకారులను చెదరగొట్టారు.

Share Now

Advertisement
Share Now
Advertisement