Shraddha Walker Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం, సీసీటీవీ ఫుటేజీలో బయటపడ్డ అసలు వాస్తవాలు, యువతిని 35 ముక్కలు చేసిన కేసులో సంచలన నిజాలు..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను తరలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Aftab Ameen Poonawalla in Jail. (Photo Credits: Twitter Video Grab)

శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమం లోనే గతంలో దొరికిన గుర్తు తెలియని మృతదేహాలు, శరీర భాగాలపై పోలీసులు దృష్టి పెట్టారు. కాగా.. తాజాగా ఓ సీసీ టీ ఫుటేజీని కూడా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ శరీర భాగాలను తరలిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మే 18న ఢిల్లీ లోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరం లోనే ఉన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్‌లో కొన్ని గుర్తు తెలియని శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. పాండవ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రామ్‌లీలా మైదానానికి సమీపంలో చెత్తకుప్పలో కుళ్లి పోయిన స్థితిలో ఉన్న మనిషి తలను చేతులను పోలీసులు, ఫోరెన్సిక్ బృందం గుర్తించారు.

అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపర్చినట్టు అప్పటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్