IPL Auction 2025 Live

Ganesh Visarjan Traffic: 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలు.. గణనాథుల నిమజ్జనం వేళ ట్యాంక్‌ బండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది.

Ganesh Visarjan Traffic (Credits: X)

Hyderabad, Sep 16: హైదరాబాద్ (Hyderabad) లోని ట్యాంక్ బండ్ (Tankbund) పరిసరాల్లో భారీగా వాహనాలు నిలిచాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులు వరుసగట్టడం, సోమవారం ప్రైవేటు కార్యాలయాలు పనిచేస్తుండటం, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు వెరసి హుస్సేన్ సాగర్ సమీపంలో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. ట్యాంక్ బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటలకుపైగా సమయం పడుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ను నియంత్రించడంలో పోలీసుల పర్యవేక్షణ తగినంతగా లేకపోవడంతో  ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వాహనదారులు వాపోతున్నారు.

జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?

అంతటా రద్దీ

ఎంజే మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు, పారడైజ్ నుంచి రాణిగంజ్ వరకు, మినిస్టర్స్ రోడ్డు నుంచి బుద్ధ భవన్ వరకు, ఖైరతాబాద్ నుంచి సచివాలయం వరకు భారీగా వాహనాలు నిలిచాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ లో ఘోరం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య