Kane Williamson: టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ఘోరపరాభవం, వన్డేల్లో, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు.

Kane Williamson Steps Down as New Zealand's White-Ball Captain

 Kane Williamson steps down as New Zealand's captain:  టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో జ‌ట్టు ఘోర ప్ర‌ద‌ర్శ‌న‌తో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు పగ్గాలను వదిలేసిన కేన్ మామ ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్ కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. ఇకపై వన్డేల్లో, టీ20ల్లోనూ సారథిగా ఉండనని ప్రకటించాడు. అంతేగాక 2024-25 సీజ‌న్‌కు సంబంధించి జాతీయ కాంట్రాక్టు నుంచి కూడా అత‌ను వైదొలిగాడు. ఈ విష‌యాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు త‌న అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్ల‌డించింది.

టీ20 వరల్డ్ కప్ లో కివీస్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. దాదాపు దశాబ్దం తర్వాత సెమీఫైనల్స్‌కు చేరలేదు. ఈ మెగాటోర్నీలో గ్రూప్-సీలో ఉన్న బ్లాక్‌క్యాప్స్ తమ తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్ చేతిలో 84 పరుగుల ఘోర ఓట‌మిని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన పోరులో 13 పరుగుల తేడాతో ప‌రాజయంపాలైంది. అనంతరం పసికూనలు ఉగాండ, పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచుల్లో వరుసగా తొమ్మిది, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్-సీ టేబుల్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. విలియమ్సన్ తీసుకున్న నిర్ణయాలు తనని రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీడియో ఇదిగో, ఓడిపోయారని కామెంట్ చేసిన అభిమానితో గొడవ పడ్డ పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌

కెప్టెన్సీలో కేన్ విలియమ్సన్ ఎన్నో ఘనతలు సాధించాడు. టెస్టు ఛాంపియన్‌షిప్-2021‌లో న్యూజిలాండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. 2019 వన్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌, 2021 టీ20 ప్ర‌పంచ కప్‌ల్లో కివీస్‌ను ఫైనల్ వ‌రకు తీసుకెళ్లాడు. ఇక ఇటీవల తన కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని కేన్ మామ‌ అందుకున్నాడు. కివీస్ త‌ర‌పున దాదాపు 350 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 40 టెస్టులకు, 91 వన్డేలకు, 75 టీ20లకు సార‌థ్యం వ‌హించాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement